మేడారం వెళ్లే భక్తులకి గుడ్ న్యూస్. ఆసియా ఖండం లోనే రెండవ అతిపెద్ద జాతరగా పేరుగాంచింది మేడారం సమ్మక్క సారమ్మల జాతర. ఇప్పుడు ఈ జాతరకి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసేశారు రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మహా జాతర్ని ప్రతిష్టాత్మకంగా జరుపుతోంది. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో మేడారంలో 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు మేడారం సమ్మక్క సారమ్మల జాతర అత్యంత వైభవంగా జరగబోతోంది.
దీనికి ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోంది వివిధ ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులు నడుపుతుంది అలానే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈసారి హెలికాప్టర్ సేవలు అందించడానికి చూస్తోంది. హనుమకొండ నుండి మేడారం హెలికాప్టర్లో వెళ్లడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ప్రయాణించే వాళ్ళకి ప్రత్యేక దర్శన సదుపాయం కూడా ఉంటుంది. మొక్కులు చెల్లించిన తర్వాత తిరుగు పయనం కూడా ఉంటుంది ఇప్పుడు ఇలా జాతరకి వచ్చేవాళ్ళుకు ప్రయాణం చేసే సౌకర్యాన్ని తీసుకువచ్చారు గతంలో సేవలు అందించిన ప్రైవేట్ సంస్థతో ఈసారి కూడా అధికారులు ఒప్పందని కుదుర్చుకున్నారు