పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..!

-

చాలా రోజుల నుండి ఎంతో మంది PF వడ్డీ కోసం ఎదురు చూస్తున్నారు. 2022 సంవత్సరం ఇప్పుడు పూర్తై పోయింది. అయినా కానీ ఇప్పటి దాకా PF పై వడ్డీ డబ్బులు రాలేదు. వీటి కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లేదా EPFO కస్టమర్లు చూస్తున్నారు.

ఇక పూర్తి వివరాలని చూస్తే.. అయితే ఈ డబ్బులు జనవరి చివరి నాటికి అంటే బడ్జెట్‌కు ముందు PFపై వడ్డీ డబ్బు బదిలీ చెయ్యచ్చని తెలుస్తోంది. కానీ దీని గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.1 శాతం వడ్డీని ఇవ్వవచ్చని.. జనవరి చివరి నాటికి ప్రభుత్వం వీటిని ఇస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈపీఎఫ్‌ పై వడ్డీ దాదాపు బ్యాంక్ ఎఫ్‌డీ పై వడ్డీకి సమానంగా ఉంటుంది. ఇక మీరు బ్యాలెన్స్ ని చూడడం కూడా ఈజీయే. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సులభంగా PF బ్యాలెన్స్‌ ని తనిఖీ చేయవచ్చు.

రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 011-22901406కు మిస్డ్ కాల్ ఇచ్చి బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. UAN EPFOతో రిజిస్టర్ చేయబడితే SMS ద్వారా మీరు బ్యాలన్స్ తెలుసుకోవచ్చు. ఇలా బ్యాలెన్స్ ని తెలుసుకోవడానికి మీరు EPFOHO UAN ENGని 7738299899కి పంపాలి. ఇలా కూడా ఈజీగా మీరు బ్యాలెన్స్ ని తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news