ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఫలితంగా గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో హైదరాబాద్ కేవలం మూడు విజయాలు మాత్రమే నమోదు చేసి ఆరు మ్యాచ్‌లలో పరాజయం పాలైంది. ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోవాలంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం హైదరాబాద్‌కు అత్యంత కీలకం. మరోవైపు గుజరాత్ టైటాన్స్ కూడా తొమ్మిది మ్యాచ్‌లు ఆడి ఆరింట్లో గెలిచి, మూడింట్లో ఓటమి చవిచూసింది.
హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, సిమర్జీత్ సింగ్, జీషన్ అన్సారీ, మహమ్మద్ షమీ.
గుజరాత్: శుభమాన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కరీం జనత్/ఇషాంత్ శర్మ.