యోగా దినోత్సవం రోజున మళ్లీ ఏపీలో పర్యటిస్తా: మోడీ

-

జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించనున్న కార్యక్రమంలో తాను పాల్గొననున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతూ, యోగా ప్రాధాన్యతను మరోసారి ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. “వచ్చే 50 రోజులు యోగాను ప్రోత్సహించే విస్తృత కార్యక్రమాలు ఏపీలో నిర్వహించాలి. ఆధ్యాత్మికంగా, శారీరకంగా మనల్ని శక్తివంతంగా చేసే ఈ విద్యపై రాష్ట్రవ్యాప్తంగా చైతన్యం రావాలి,” అని ప్రధాని సూచించారు.

విశాఖ పర్యటన సందర్భంగా అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ, రాష్ట్ర అభివృద్ధిపై కూడా తన అభిప్రాయాలు వెల్లడించారు. “ఏపీలో కలలు కనేవాళ్ల సంఖ్య తక్కువ కాదు, ఆ కలల్ని నిజం చేసే వాళ్లూ తక్కువేనని చెప్పలేం. సీఎం చంద్రబాబు మూడు ఏళ్లలో అమరావతి పనులను పూర్తిచేస్తామని చెప్పారు. ఆ తర్వాత state’s GDP ఎటువంటి గరిష్ఠ స్థాయికి చేరుతుందో నేను ఊహించగలను” అంటూ ప్రధాని వ్యాఖ్యానించారు. తన ప్రసంగాన్ని తెలుగు పదాలతో ప్రారంభించి మోడీ స్థానికులను ఆశ్చర్యపరిచారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news