కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త.. అదనంగా 8 మార్కులు కలిపే ఛాన్స్ !

-

కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష నిన్న ప్రశాంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షను విజయవంతగా పూర్తిచేశారు అధికారులు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. సివిల్‌, ట్రాన్స్‌పోర్టు, ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఆదివారం పరీక్షలు నిర్వహించింది.

సివిల్‌ ఇతర విభాగాల్లో 15,644, రవాణాశాఖలో 63, ఎక్సైజ్‌శాఖలో 614 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నియామకానికి గత ఏప్రిల్‌లో నోటిషికేషన్‌ విడుదల చేసిన విషయం విధితమే. ఆయా పోస్టులకు 6,61,196 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.

ఇది ఇలా వుండగా… తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో పలు ప్రశ్నల్లో తప్పులు ఉన్నట్టు తెలుస్తోంది. 13 ప్రశ్నల్లో గందరగోళం ఉన్నట్లు అభ్యర్థులు గుర్తించగా? ఎక్కువ మంది నుంచి ఫిర్యాదులు వస్తే TSLPRB మార్కులు కలిపే అవకాశం ఉంది. గరిష్టంగా 8 మార్కులు కలపవచ్చని చెబుతున్నారు నిపుణులు. అయితే  తుది కీ విడుదల తర్వాతే దీనిపై స్పష్టత వస్తుంది అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version