మీకు రేషన్ కార్డు వుందా..? అయితే ఇది మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్నవాళ్ళకి గుడ్ న్యూస్ చెప్పింది. మరి పూర్తి వివరాలను చూస్తే.. ప్రధాన్ మంత్రిగరీబ్ కల్యాణ్ అన్న యోజన మీద ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఉచిత రేషన్‌ను సెప్టెంబర్ 30 తర్వాత ఎక్స్టెండ్ చేసేలా కనపడుతోంది.
త్వరలోనే ఉచిత రేషన్ పై నిర్ణయం తీసుకుంటుంది అని ఫుడ్ సెక్రటరీ సుదాన్సు పాండే అన్నారు. అయితే మరి ఏది ఎలా ఎప్పుడు జరుగుతుందో తెలీదు. 2020 మార్చి లో ఈ ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన స్కీమ్ ని తీసుకు రావడం జరిగింది. 80 కోట్ల మంది రేషన్ కార్డు లబ్ధిదారులకు దీని కింద ఫ్రీ బియ్యం ఇస్తున్నారు.
ఒక్కో వ్యక్తికీ ఐదు కేజీలను ఇస్తున్నారు. కరోనా మహమ్మారి వలన వచ్చిన లాక్ డౌన్‌లో పేదలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మోదీ ఈ స్కీమ్‌ను తీసుకు రావడం జరిగింది. సెప్టెంబర్ 30 తర్వాత ఎక్స్టెండ్ చేసేలా కనపడుతోంది. మరి అలా చేస్తారా లేదా అనేది చూడాలి. పీఎంజీకేఏవై కింద రూ. 3.4 లక్షల కోట్లు మోడీ సర్కార్ కేటాయించడం అయ్యింది. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ గడువును పొడిగించకపోవచ్చని కొంత మంది అనుకుంటున్నారు. మరి ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే చాలా మందికి లాభదాయకంగా ఉంటుంది.