సంక్రాంతి స్పెష‌ల్‌..ఆర్టీసీ ప్ర‌యాణికుల‌కు స‌జ్జ‌నార్ శుభ‌వార్త‌

-

మాజీ ఐపీఎల్ అధికారి స‌జ్జనార్‌.. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి… చాలా దూకుడుగా వ్య‌వ‌హరిస్తున్నారు. ఎవ‌రూ ఊహించ‌ని నిర్ణ‌యాలు తీసుకుంటూ.. తెలంగాణ ఆర్టీసీని ప‌రుగులు పెట్టుస్తున్నారు. అయితే.. తాజాగా మ‌రో కొత్త సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ. సంక్రాంతి పండుగ వ‌స్తున్న త‌రుణంలో.. చాలా మంది.. సొంత ఊర్ల‌కు వెళ‌తారు. ముఖ్యంగా ఏపీకి చెందిన వారు.. ఊర్ల‌కు వెళ‌తారు.

వారిని దృష్టి లో ఉంచుకుని… ఆన్ లైన్ లో బ‌స్ టికెట్ల ను అందుబాటులోకి తీసుకు వ‌చ్చింది తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ. అలాగే.. యూపీఐ సేవ‌ల‌ను కూడా తాజాగా అందుబాటు లోకి తీసుకు వ‌చ్చింది ఆర్టీసీ యాజ‌మాన్యం. https://tsrtconline.in వెబ్ సైట్ ద్వారా..టికెట్ల‌ను బుక్ చేసుకోవాల‌ని.. ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ ట్విట్ట‌ర్ వేదిక‌గా… పేర్కొన్నారు. సంక్రాంతి సెలవుల నేప‌థ్యంలో… ఈ సేవ‌ల‌నున ప్ర‌యాణికులు అంద‌రూ వినియోగించుకోవాల‌న్నారు. ముందే టికెట్లు బుక్ చేసుకుని.. టెన్ష‌న్ కు దూరం చేసుకోండ‌న్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version