వాహనదారులకు గుడ్ న్యూస్…!

-

సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్‌ను సవరించింది. ఇది నిజంగా వాహనదారులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. దీంతో వలన చాలా మందికి ప్రయోజనం కలుగనుంది. వెహికల్ ఓనర్‌షిప్ సులువు కానుంది. ఇక దీనికి సంబంధించి పూర్తిగా చూస్తే… ఈ కొత్త రూల్స్ కి సంబంధించి ఎవరైనా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ లో నామినీ పేరును చేర్చాలంటే ఇక నుండి మరెంత ఈజీ.

ఒకవేళ కనుక వాహన యాజమాని చనిపోతే నామినీకి ఓనర్‌షిప్ బదిలీ కూడా జరిగిపోతుంది. ఈ విషయం లో కూడా శ్రమ పడక్కర్లేదు. ఒకవేళ కనుక వాహన యజమాని మరణిస్తే దాన్ని మళ్లీ ఇతరుల పేరు పైకి మార్చుకోవడం ప్రస్తుతం కష్టమైనా పని అనే చెప్పాలి.

కానీ ఈ కొత్త రూల్స్ వల్ల ఇది ఈజీ అవుతుంది. వెహికల్ ఓనర్ వాహన రిజిస్ట్రేషన్ టైం లో నామినీ పేరు ఇవ్వాల్సి ఉంటుంది. లేదు అంటే ఆన్‌లైన్ అప్లికేషన్ ద్వారా నామినీ పేరును జత చేసుకోవచ్చు. ఒకవేళ ఓనర్ చనిపోతే ఇలా నామినీ పేరు ఉన్న వారికి ఆ వెహికల్ వెళ్లిపోతుంది.

నామినీనే వెహికల్ ఓనర్ అవుతారు. దీనిలో ఏ సమస్య కూడా ఉండదు. వెహికల్ ఓనర్ చనిపోయిన విషయాన్ని 30 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ అథారిటీకి తెలియజేయాలి. ఫామ్ 31 ఫామ్‌ను 3 నెలలలోగా రిజిస్ట్రేషన్ అథారిటీకి ఇవ్వాలి. అలానే నామినీ ఆ వెహికల్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలియజేయాల్సి వుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version