నిశ్చితార్థం చేసుకున్న “గుడ్ నైట్” మూవీ హీరోయిన్…!

-

రెండు నెలల క్రితం ఎటువంటి అంచనాలు లేకుండా ఓటిటిలో విడుదల అయిన ఒక చిన్న సినిమా “గుడ్ నైట్”. ఈ సినిమా ఒక మంచి స్క్రీన్ ప్లే తో ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరీ గా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది, ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన మీతా రఘునాధ్ అమాయక పాత్రలో సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చి సినిమా విజయంలో కీలక పాత్ర వహించింది. ఈ సినిమా తర్వాత మీతా కు చాలా ఆఫర్లు వస్తున్నాయి. కానీ తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈమె తన వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నట్లు సోషల్ మీడియాలో ఈమె నిశ్చితార్దానికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటో లలో మీతు రఘునాధ్ తనకు కాబోయే వరుడితో ఉన్నది.

త్వరలోనే పెళ్ళికి సంబంధించిన వార్తలు చెప్పనున్నారని సమాచారం. ఇక ఈ వార్త తేలిన కుర్రాళ్ళు అయ్యో అప్పుడే మీతా కు పెళ్ళై పోతోందా అంటూ మదనపడుతున్నారు అట.

Read more RELATED
Recommended to you

Latest news