గూగుల్ మెచ్చిన యాప్.. ఇది ఉంటే అంతా ఆనందమే..!

-

ప్రస్తుతం గూగుల్ ప్లేస్టోర్ లో ఎన్నో రకాల యాప్ లు అందుబాటులో ఉన్నాయి అనే విషయం తెలిసిందే. కొన్ని రకాల యాప్ లు ఎంతో మంది వినియోగదారులను ఆకర్షిస్తూ ప్రస్తుతం దూసుకుపోతుంటే.. మరికొన్ని మాత్రం తక్కువ మంది వినియోగదారుల తోనే ముందుకు సాగుతున్నాయి. అయితే కొన్ని యాప్స్ తో ఎంతో ఉపయోగం ఉన్నప్పటికీ అవి ఎక్కువగా వాడుకలో లేవు అనే విషయం తెలుస్తుంది. అయితే ఇటీవలే గూగుల్ ఒక యాప్ ని బెస్ట్ యాప్ గా ప్రకటించింది.

స్లీప్ స్టోరీస్ ఫర్ కామ్ స్లిప్.. మెడిటేషన్ విత్ వైసా అనే యాప్ ను గూగుల్ బెస్ట్ యాప్ గా గుర్తించింది. జో అగర్వాల్ వైసా యాప్ ను ప్రారంభించింది. ప్రస్తుతం రోజుకు కస్టమర్ లను పెంచుకుంటూ పోతుంది ఈ యాప్. ఇక ఈ యాప్ ద్వారా మెదడుకు విశ్రాంతి ఇచ్చేటువంటి కొన్ని ఎక్సర్ సైజులను టూల్స్ నూ సూచిస్తూ హాయిగా నిద్రపోయేందుకు పలురకాల సూచనలు చేస్తూ ఉంటుంది. ఇక యాప్లోని టూల్స్ ద్వారా హాయిగా నిద్రపోయేందుకు అవకాశం ఉంటుందట. మరీ ఎక్కువ అవసరమైతే ఏకంగా స్లిప్ థెరపీస్ట్ తో సెషన్ కూడా ఏర్పాటు చేస్తుండటం ఈ యాప్ స్పెషాలిటీ. ఇక ఈ యాప్ ఎంతోమందికి వినియోగ కరంగా ఉంటుంది అని గూగుల్ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news