దర్శకుడిని రూ.పది వేలు అడిగిన స్టార్ హీరో..తర్వాత ఏమైందంటే?

-

జనరల్ గా స్టార్ హీరోల రెమ్యునరేషన్ రూ.కోట్లలోనే ఉంటుందని సినీ పరిశీలకులు చెప్తుంటారు. కాగా, ఓ హీరో రూ.పది వేలు దర్శకుడిని అడిగితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అలాంటి సంఘటనే తాజాగా వెరీ ఫన్నీగా జరిగింది.

‘పక్కా కమర్షియల్’ ఫిల్మ్ ప్రమోషన్స్ మొదటి నుంచి వినూత్నంగా చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో హీరో గోపీచంద్ కు ఇచ్చిన టాస్క్ లో భాగంగా తన దర్శకుడు మారుతికి ఫోన్ చేసి రూ.పది వేలు అడిగాడు. ఏ కారణం చెప్పకుండా తనకు పది వేల రూపాయలు కావాలని అన్నాడు.

మారుతి వెంటనే ఓకే చెప్పేయడంతో పాటు గూగుల్ పేలో డబ్బులు పంపించాడు. తను అడిగితే పది లక్షలైనా ఇచ్చేస్తాడని గోపీచంద్ కాన్ఫిడెంట్ గా చెప్పేశాడు. దాంతో యాంకర్ వావ్ అని అంది. ఈ క్రమంలోనే యాంకర్ యాభై వేలు (ఐదొందల నోట్లు) నిమిషంలో లెక్క బెట్టాలని చెప్పగా, అందుకు ఒప్పుకున్న గోపీచంద్ 30 సెకన్లలోనే కంప్లీ్ట్ చేశాడు. మొత్తంగా ‘పక్కా కమర్షియల్’ మూవీ చాలా కమర్షియల్ గా మేకర్స్ ప్రమోట్ చేస్తున్నారన్న సంగతి అర్థమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version