అఖండ-2 మూవీలో విలన్‌గా గోపిచంద్..?

-

నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ మూవీ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. కరోనాతో విడుదలైన తొలి చిత్రం కూడా అఖండ అని చెప్పవచ్చు.మూవీలో బాలయ్యను మరోసారి డ్యుయల్ రోల్‌లో చూపించి దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. వీరిద్దరి కాంబోలో వచ్చిన లెజెండ్, సింహా, అఖండ హ్యాట్రిక్ హిట్స్‌గా నిలిచాయి. అయితే, తాజాగా మరోసారి వీరి కాంబో రిపీట్ కానున్నట్లు సమాచారం.

త్వరలోనే బాలయ్య,బోయపాటి కాంబోలో అఖండ-2 రానున్నట్లు తెలుస్తోంది. దీనికి ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇందులో విలన్‌ పాత్రలో హీరో గోపిచంద్ కనిపిస్తారని కూడా ప్రచారం సాగుతోంది. గోపిచంద్ బాలయ్య బాబుకు ప్రతినాయకుడిగా కనిపించేందుకు అంగీకరిస్తారా? లేదా తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ కథను గోపిచంద్‌కు దర్శకుడు బోయపాటి వినిస్తారని తెలుస్తోంది. వీరి కాంబోలో సినిమా వస్తే తప్పకుండా హిట్ అవుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news