క్వారంటైన్ లో ప్రముఖ టెన్నిస్ స్టార్ నొవాక్‌ జకోవిచ్ కోచ్…!

-

goran ivanisevic novak djokovic's coach tested with corona positive
goran ivanisevic novak djokovic’s coach tested with corona positive

కరోనా ప్రపంచాన్ని తన పిడికిలిలో బిగించుకొని వీరవిహంగం చేస్తుంది. సాధారణ కూలీ నుండి సెలబ్రిటీల దాకా ఎవ్వరినీ వదలడం లేదు ఈ మహమ్మారి. ఎన్ని జాగ్రత్తలు వహించినా ఎన్ని చర్యలు చేపట్టినా ఈ మహమ్మారి ఏదో ఒక తావు చూసుకొని కాటు వేస్తూనే ఉంది. తాజాగా టెన్నిస్ క్రీడాకారుడు వింబుల్డన్‌ మాజీ ఛాంపియన్‌, వరల్డ్‌ నంబర్‌వన్‌ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ కోచ్‌ మాజీ టెన్నిస్ ప్లేయర్ గొరాన్‌ ఇవాన్‌ సెవిచ్‌(క్రొయేషియా) కరోనా బారినపడ్డాడు. ఇటీవలే గొరాన్ ఎగ్జిబిషన్‌ సిరీస్‌కు వెళ్లారు అక్కడ ఆయనకు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ అని రిపోర్ట్ లో తేలింది. అయితే ఆయనకు గత 10 రోజుల్లో కరోనా పరీక్షలు నిర్వహించగా రెండు సార్లు నిగిటివ్ వచ్చి మూడవ సారి టెస్ట్ చేయగా పాజిటివ్ రావడం ఇప్పుడు కలవరం రేపింది. జకోవిచ్‌ కోచ్ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో జకోవిచ్ ను కూడా క్వారంటైన్ కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version