జేసీ ఫ్యామిలీకి మరో షాక్.. రిమాండ్ పొడిగింపు.!

-

టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకు జేసీ అస్మిత్‌ రెడ్డిలను ఫోర్జరీ కేసులో ఈ నెల 12న హైదరాబాద్‌లో అనంతపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.. అనంతరం వారిని అనంతపురం తరలించారు.. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ముందు హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ కోసం కడప జైలుకు తరలించారు. అయితే తాజాగా వీరి రిమాండ్ ను జూలై 1 దాకా పొడిగించింది కోర్టు. ఇప్పటికే ఓ కేసులో జూన్ 24 వరకు రిమాండ్‌ విధించారు.

 

మరికొన్ని కేసులకు సంబంధించి.. కడప జైలులో ఉన్న ప్రభాకర్‌ రెడ్డి, అస్మిత్‌ రెడ్డిలను పోలీసులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయమూర్తి ముందు విచారణకు హాజరుపరిచారు. దీంతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. రిమాండ్‌ పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోపక్క ప్రభాకర్‌ రెడ్డి, అస్మిత్‌ రెడ్డిలకు బెయిల్‌ ఇవ్వాలని అనంతపురం జిల్లా కోర్టులో వారి తరఫు న్యాయవాదులు పిటిషన్‌లు దాఖలు చేశారు. అయితే దీనిపై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేశారు. అలాగే ప్రభాకర్‌ రెడ్డి, అస్మిత్‌ రెడ్డిలను తమ కస్టడీకి అప్పగించాలని తాడిపర్తి పోలీసులు గుత్తి కోర్టులో పిటిషన్‌లో దాఖలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version