ఫెంగాల్ తుఫాన్ ఎఫెక్ట్‌..కరెంట్‌ కోతలు ఉండకుండా చూడాలని మంత్రి గొట్టిపాటి ఆదేశాలు !

-

ఫెంగాల్ తుఫాన్ ఎఫెక్ట్‌ నేపథ్యంలో..కరెంట్‌ కోతలు ఉండకుండా చూడాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్‌ ఆదేశాలు ఇచ్చారు. ఏపీలో తుపాన్ ప్రభావంతో వర్ష సూచన నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్… నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం నాలుగు జిల్లాల్లోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు మంత్రి గొట్టిపాటి రవి కుమార్‌.


భారీవర్షం, ఈదురుగాలులతో విద్యుత్ స్థంబాలు ఒరిగే ప్రమాదం ఉంటుందని… ప్రజలు జాగ్రత్తలు పాటించేలా చూడాలని ఈ సందర్భంగా విద్యుత్ శాఖామంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. సమస్యపై ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే రంగంలోకి దిగాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. విద్యుత్ సరఫరాకు అవాంతరాలు ఏర్పడితే తక్షణమే పునరుద్ధరించాలని సూచనలు చేశారు విద్యుత్ శాఖామంత్రి గొట్టిపాటి రవికుమార్. ఇక అటు తుఫాన్ నేపథ్యంలో మధ్యాహ్నం నుండి తిరుపతి జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, అన్ ఎయిడెడ్ విద్యాసంస్థలకు, అంగన్వాడీ కేంద్రాలకు, జూనియర్ కళాశాలకు సెలవు‌‌ ప్రకటించారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version