ప్రజల మీద నింద తోసేయడం లో ప్రభుత్వాలు భలే కలిసి పని చేస్తాయి !

-

కరోనా వైరస్ కట్టడి చేయడంలో ప్రభుత్వాలు చాలావరకు విఫలమయ్యాయి. ఈ వైరస్ వచ్చినా ప్రారంభంలో విదేశాల నుండి వచ్చిన వారిని గుర్తించి వారికి హోమ్ క్వారంటైన్ సరిగ్గా పాటిస్తే సరిపోతుంది అని ప్రభుత్వ అధికారులు భావించారు. కానీ స్టార్టింగ్ లోనే చాలావరకు ఫెయిల్ అయ్యారు. వచ్చిన విదేశీయుడు ఇంటిలో ఉన్న వారితో కలవడం ఆ ఇంటిలో ఉన్న వాళ్ళు బయట ఇతరులతో కలవటంతో కొన్ని పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమయం లో ఢిల్లీ మార్కజ్ మజీద్ సమావేశాలకు వెళ్లినవారికి చాలా మటుకు కరోనా వైరస్ పాజిటివ్ రావటంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా మారిపోయింది.దీంతో రోజురోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయటపడటంతో ప్రభుత్వాలు నాయకులు కూడా చేతులెత్తేస్తున్నారు. దీంతో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనపడటంతో తప్పించుకోవడానికి రాజకీయ నాయకులు ప్రజల మీద నిందలు వేయడానికి రెడీ అయిపోతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య మంత్రి ఆళ్ల నాని చేసిన వ్యాఖ్యలు అలానే ఉన్నాయి. కరోనా వైరస్ నియంత్రించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని కానీ ప్రజలు సహకరించడం లేదని అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు. తాము ఎంత చేసినా జనాల సహకారం లేకపోతే కరోనా కట్టడి సాధ్యం కాదని దాదాపుగా చేతులెత్తేసేలా మాట్లాడేశారు.

 

అంతా వాస్తవమే గానీ ముందుగా ప్రభుత్వాలు బాధ్యత తీసుకుంటే ప్రజలు సహకరిస్తారు. కానీ ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తి చెందే విషయాలలో ముందుచూపు కొరవడటంతో ఫెయిల్ అవ్వటంతో వైరస్ వ్యాప్తి తీవ్రతరమైంది. ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ప్రజలైన ఏం చేస్తారండి అంటూ మరి కొంతమంది మేధావులు అంటున్నారు. చాలా రాష్ట్రాలలో వైరస్ అదుపులేని ప్రాంతాలలో రాజకీయ నాయకులు ఈ విధంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో చాలామంది రాజకీయ మేధావులు ప్రభుత్వ ఆలోచనలు విఫలమైతే ప్రజల మీదకి సమస్యని తోసేయడానికి బలే కలసి పని చేస్తారు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version