ఆంధ్ర విశ్వవిద్యాలయం 85, 86వ ఉమ్మడి స్నాతకోత్సవం వేదికపై బుధవారం ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ మధ్య వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వైద్య రంగంలో ప్రైవేటు ఆసుపత్రులకు ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రభుత్వ ఆసుపత్రులు నిర్వీర్యం అయ్యాయని, విద్యారంగంలో ఆ పరిస్థితి రానీయొద్దని తెలుగు రాష్ట్రాల గవర్నర్, ఏయూ వీసీ నరసింహన్ ప్రభుత్వానికి సూచించారు. అయితే ఆయన ప్రకటన విరుద్దంగా … ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ప్రైవేటు వర్సిటీలతో పోటీ పడాలంటూ మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు చేశారు. దీంతో వెంటనే స్పందించిన గవర్నర్ మంత్రి వ్యాఖ్యలను ఖండించి అలా అనడం నేరమని వ్యాఖ్యానించారు. దీంతో ఒక్క సారిగా అవాక్కైన శ్రీనివాస్ చిన్నబోయారు. ఇటు గవర్నర్ అటు మంత్రి పరస్పర వ్యాఖ్యలతో సమావేశంలో ఉన్న వారికి అసలేం జరుగుతుందో అర్థం కాలేదు. ఈ కార్యక్రమం సందర్భంగా .. ఢిల్లీ ఐఐటీ వీసీ వి. రామ్ గోపాల రావుకు ఏయూ గౌరవ డాక్టరేట్ ని ప్రదానం చేసింది.