తెరాస అధినేత కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతికి, ప్రజల సంక్షేమం కోసం మరో సారి చండీ యాగాన్ని చేపట్టనున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 21 నుంచి 25 వరకు మహారుద్ర సహిత సహస్ర చండీ యాగాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన సీఎం యాగం ఏర్పాట్లను పరిశీలించారు. రోజులు దగ్గర పడుతున్న సందర్భంగా పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి ఈ క్రతువును నిర్వహించనున్నారు.
ఈ మహత్తర క్రతువు నిర్వాహణకు సంబంధించిన వివరాలను… ఇటీవల విశాఖ వెళ్లిన సీఎం కేసీఆర్.. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. యాగంలో 200 మంది రుత్వికులు పాల్గొంటారు. సందర్శకులు, భక్తులను అనుమతించే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.