బ్యాంకు అకౌంట్ నిర్వహణపై ప్రభుత్వ రంగ సంస్థలకు మార్గదర్శకాలను తెలంగాణ ఆర్థిక శాఖ జారీ చేసింది. ఇకపై కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. ప్రతినెల బ్యాంకు ఖాతాలను వెరిఫై చేయాలి. డీటెయిల్స్‌ను 10వ తేదీలోపు ఫైనాన్స్ శాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని జారీ చేసినది. అవసరం లేని బ్యాంకు అకౌంట్స్‌ను వెంటనే క్లోజ్ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నది ఆర్థిక శాఖ. మార్చి 10లోపు వీటికి సంబంధించిన సమాచారాన్ని నిర్దేశిత ఫార్మాట్‌లో ఫైనాన్స్ శాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని పేర్కొంది. ఆయా డిపార్ట్‌మెంట్లు వివిధ బ్యాంకుల్లో ఉన్న ఎఫ్‌డీలను ప్రభుత్వ ఎంపానెల్ బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేయాలని తెలిపింది.
అన్ని ఎఫ్‌డీలను ఒకే బ్యాంకులో ఉండేవిధంగా చూడాలని ఇష్టం వచ్చినట్టు ఎఫ్‌డీలను చేయడానికి వీలులేదని.. ఎఫ్‌డీలు ప్రభుత్వ లీడ్ బ్యాంకులోనే చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. కొన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన సొమ్మను వివిధ ఖాతాలను మళ్లించి నొక్కేసిన వ్యవహారాలు, ఎఫ్‌డీలను డ్రా చేసిన ఘటనలు వెలుగు చూసిన విషయం తెలిసినదే. ఈ తరుణంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.