పోలీసుల వ్యవహార శైలితో ఓ వ్యక్తి మరణించిన సంగతి అందరికి తెలిసిందే. పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత పోలీసులు మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులు మృతుడు కిరణ్ ను శ్మశాన వాటికలో దహన సంస్కారాలు చేశారు. చీరాలలో వెలుగు చూసిన ఈ ఘటనతో మృతుడి కుటుంబసభ్యుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంటి సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రాణం తీసిన పోలీసులను వెంటనే శిక్షించాలని కుటుంబ సభ్యులు మండిపడ్డారు. న్యాయం జరిగే వరకూ పోరాడుతామన్నారు.
ఇదిలా ఉండగా, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మృతుడి కుటుంబాన్ని సందర్శించి పరామర్శించాడు. చీరాలలో పోలీసుల వ్యవహార శైలితో కిరణ్ మృతి చెందడం బాధకరమన్నారు. కిరణ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. కిరణ్ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని ఆమన పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కిరణ్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు.