ఖాళీగా ఉన్న శాసన మండలి చైర్మెన్ ను ఎన్నుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందు కోసం ప్రయత్నాలు సైతం మొదలు పెట్టింది. శాసన మండలి చైర్మెన్ ఎన్నిక కోసం గవర్నర్ తమిళ సై అనుమతి కోసం గురువారమే ప్రతిపాదనలు పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన చైర్మెన్ ఎన్నిక ప్రతిపాదనకు గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ ఆమోదం తెలిపింది. దీంతో చైర్మెన్ ఎన్నిక ప్రక్రియా అధికారికంగా ప్రారంభం అయింది.
శాసన మండలి చైర్మెన్ ఎన్నిక గురించి ఈ రోజు ఎమ్మెల్సీలు అందరికీ సమాచారం ఇస్తు లేఖలు పంపించనున్నారు. ఈ లేఖద్వారా ఎన్నికల తేదీ, సమయాన్ని కూడా ఎమ్మెల్సీలకు సమాచారం అందింస్తారు. శాసన మండలి చైర్మెన్ ఎన్నిక సోమవారం జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాగ ఎన్నికకు ఒక రోజు ముందు.. నామినేషన్లు స్వీకరించనున్నారు.
ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియా ఉంటుంది. తర్వాతి రోజు ఎన్నిక ఉంటుంది. కాగ మండలిలో అధికారి పార్టీ టీఎర్ఎస్ కు మాత్రమే బలం ఉండటంతో టీఆర్ఎస్ నుంచే నామినేషన్ వస్తుంది. కాగ చైర్మెన్ పదవికి గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మెన్ పదవికి బండా ప్రకాశ్ పేర్లను గులాబీ బాస్ ఎంచుకున్నారని తెలుస్తుంది.