మ‌గువ‌ల‌కు గుడ్ న్యూస్.. భారీగా ప‌త‌నం అయిన బంగారం, వెండి ధ‌ర‌లు

-

ఉక్రెయిన్ – ర‌ష్యా యుద్ధం ఎఫెక్ట్ తో గ‌త కొద్ది రోజుల నుంచి బంగారం ధ‌ర‌లు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. కేవ‌లం ఈ ప‌ది రోజుల్లోనే బంగారం పై రూ. 3,820 పెరిగింది. కాగ నేడు ఈ పెరుగుద‌లకు బ్రేక వేస్తు.. కొనుగోలు దారుల‌కు ఊర‌టను ఇస్తు.. భారీగా ధ‌ర‌లు త‌గ్గాయి. తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్ర‌తి ప‌ది గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై ఈ రోజు భారీ స్థాయిలో ఏకంగా.. రూ. 1,600 త‌గ్గింది.

అలాగే 24 క్యారెట్ల బంగారంపై గ‌ణ‌నీయంగా.. రూ. 1,750 త‌గ్గింది. దీంతో ప‌ది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 48,200 గా 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 52,580 గా ఉంది. ఉక్రెయిన్ – ర‌ష్యా మ‌ధ్య యుద్ధం ప్రారంభం అయిన త‌ర్వాత ఇంత భారీగా ధ‌ర‌లు త‌గ్గ‌డం ఇదే తొలిసారి. అలాగే వెండి ధ‌ర‌లు కూడా ఈ మ‌ధ్య కాలంలో విప‌రీతంగా పెరిగాయి.

గ‌త ప‌ది రోజుల్లో ఒక కిలో గ్రాము బంగారంపై రూ. 7,900 పెరిగింది. కాగ నేడు వెండి కొనుగోలు దారుల‌కు కాస్త ఊర‌ట‌ను ఇస్తు భారీగా ధ‌ర‌లు త‌గ్గాయి. నేడు ఒక కిలో గ్రాము వెండిపై ఏకంగా రూ 2,600 త‌గ్గింది, దీంతో హైద‌రాబాద్ లో కిలో వెండి ధ‌ర రూ. 74,100 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version