టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే గవర్నర్ పై నిందలు వేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం, గవర్నర్ సఖ్యతతో ఉండాలని అన్నారు. గవర్నర్ ఢిల్లీ పర్యటనలో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయని ఆయన అన్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 8ని ఉపయోగించి విశేషాధికారాలను గవర్నర్ ఉపయోగించాలని కోరారు. హైదరాబాద్ డ్రగ్స్ విషయంలో చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు. ప్రోటోకాల్ విషయంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై గవర్నర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేయని ఏ పనినైనా గవర్నర్ చేయవచ్చని ఆయన అన్నారు. గవర్నర్ బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి అంటూ టీఆర్ఎస్ పార్టీ చేసిన విమర్శలపై కూడా ఆయన స్పందించారు.
కుటుంబ సమస్యల్లో కేసీఆర్… కొడుకును సీఎం చేయడానికి గవర్నర్ పై ఒత్తడి: రేవంత్ రెడ్డి
-