ఏపీలో కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. పూర్తీ వివరాలు ఇవే..

-

జగన్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది..ఇప్పటికే ఎన్నో విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్థీ చేసింది. ఇప్పుడు మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.వైద్య శాఖలో కొత్త ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది.రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఐదు మెడికల్ కాలేజీల నిర్వహణకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలో 3,530 పోస్టులను ప్రభుత్వం సృష్టించింది..

ఒక్కో మెడికల్ కాలేజీకి 706 పోస్టులు చొప్పున మొత్తం 3,530 పోస్టులు సృష్టించేందుకు ఇటీవలల కేబినెట్ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్యం అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఇకపోతే 2023-24 విద్యాసంవత్సరం నుంచి నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, విజయనగరంలో కొత్త మెడికల్ కాలేజీలు తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి..

వైద్య కళాశాలలో 222, అనుబంధంగా ఉండే బోధనాస్పత్రిలో 484 చొప్పున పోస్టులను ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెస్తోంది. ప్రతి మెడికల్ కాలేజీ, బోధానాస్పత్రిలో ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్ పోస్టులతో పాటు, 11 ప్రొఫెసర్లు, 25 అసోసియేట్ ప్రొఫెసర్లు, 42 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 58 సీనియర్ రెసిడెంట్, 18 హెడ్ నర్సు, 200 స్టాఫ్ నర్స్, ఇతర పారామెడికల్, నాన్ మెడికల్ అడ్మినిస్ట్రేషన్ పోస్టులున్నాయి..ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు ఎటువంటి లోటు లేకుండా చూడాలని సర్కార్ 40వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టారు. ఇదే క్రమంలో ఐదు కొత్త వైద్యశాలల కోసం మరో 3,530 పోస్టులను ప్రభుత్వం కొత్తగా సృష్టించడం గమనార్హం..

Read more RELATED
Recommended to you

Exit mobile version