సిపిఎస్ రద్దు చేసేందుకు ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి – మంత్రి బొత్స

-

సిపిఎస్ రద్దు చేసేందుకు ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. సీపీఎస్ రద్దు చేస్తామని సీఎం జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మాట వాస్తవమే కానీ.. అధికారంలోకి వచ్చాక పూర్వపరాలు చర్చిస్తే సీపీఎస్ రద్దు సాధ్యం కాదని తేలిందన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే చెప్పారని అన్నారు. సీపీఎస్ కంటే మెరుగైన విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం జీపీఎస్ తీసుకువచ్చిందన్నారు.

ఇవాల 4 గంటలకు ఉద్యోగ సంఘాలతో జరిగే కేబినెట్ కమిటీ సమావేశంలో జీపీఎస్ అమలుపై మరిన్ని అంశాలు చర్చిస్తామన్నారు. “ఇప్పటివరకు నాతో మా ఇంట్లో జరిగిన సమావేశాలు అనధికారికమే, ఇవాల ఉద్యోగ సంఘాలతో జరిపే సమావేశమే అధికారికమైంది” అని అన్నారు. ఇవాల్టి సమావేశానికి రావాలని అన్ని ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం ఆహ్వానించిందని.. సమావేశానికి అన్ని ఉద్యోగ సంఘాల నేతలు వస్తారని ఆశిస్తున్నాం అన్నారు. వారు రాకపోతే సీపీఎస్ బాగుందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నట్లు అనుకుంటామన్నారు. సమావేశాన్ని ఉద్యోగ సంఘాలు బాయ్ కాట్ చేస్తే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version