ఇక టీవీలు కొన‌డం క‌ష్ట‌మే..కార‌ణం ఇదే..!

-

కేంద్ర ప్ర‌భుత్వం ఆదాయం పెంచుకునే దిశ‌గా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే బాదుడు మొద‌లు పెట్టింది. ఇక టీవీలు కొనాల‌నుకునేవారికి ఇది క‌ష్ట‌కాల‌మ‌నే చెప్పొచ్చు. ఎందుకంటే.. టీవీల తయారీలో ఉపయోగించే కీలకమైన ఓపెన్‌ సెల్‌ దిగుమతులపై అక్టోబర్‌ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం 5 శాతం సుంకాన్ని మళ్లీ అమల్లోకి తేనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు వెల్ల‌డించాయి. దేశీయంగా వీటిని తయారు చేసేందుకు మరికాస్త సమయం కావాలని గతేడాది పరిశ్రమలు కోరడంతో ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 దాకా కస్టమ్స్‌ సుంకం నుంచి కేంద్రం మినహాయింపునిచ్చినట్లు వివరించాయి.

అయితే.. ఈ గడువు అయిపోతుండ‌డంతో అక్టోబర్‌ 1 నుంచి మళ్లీ 5 శాతం సుంకం అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఇలా సుంకం విధింపుతో టీవీల ధరలు సుమారు 4 శాతం దాకా పెరుగుతాయని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. 32 అంగుళాల టీవీల రేట్లు రూ. 600 మేర, 42 అంగుళాల టీవీ రేటు రూ. 1,200–1,500 దాకా పెరుగుతాయని పేర్కొన్నాయి. అయితే, ఆర్థిక వ‌ర్గాలు మాత్రం మ‌రీ అంత‌లా ధ‌ర‌లు పెర‌గ‌వ‌ని చెబుతున్నాయి. ఓపెన్‌ సెల్‌ ప్రాథమిక ధరను బట్టి చూస్తే దిగుమతి సుంకం భారం రూ. 150–250కి మించదని అంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version