గంజాయిని లీగల్‌ చేసిన ప్రభుత్వం.. అమ్మొచ్చు, సాగు చేసుకోవచ్చు, వాడుకోచ్చు.. కండీషన్స్‌ అప్లై

-

గంజాయి వాడకం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో అందరికీ తెలుసు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గంజాయి దొరుకుతుంది. వాడే వారి సంఖ్య కూడా విపరీతంగానే ఉంది. అలాగే గంజాయిపై ఇక్కడ నిషేధం ఉంది. అమ్మినా, సాగు చేసినా,తరలించినా, తీసుకున్నా..ఇలా ఏం చేసినా.. జైలుకే. దొరకనంత వరకే దొర..దొరిగే అంతే సంగతులు. కానీ అక్కడ మాత్రం గంజాయిని లీగల్‌ చేశారు. బిజినెస్‌మెన్‌ మూవీలో మాఫీయాను లీగల్‌ చేస్తా అని మహేష్‌బాబు అన్నట్లు.. గంజాయిను లీగల్‌ చేసేశారు. అమ్మోచ్చు, సాగు చేయొచ్చు, వాడుకోవచ్చు.. ఇది ఒక వర్గానికి గుడ్‌ న్యూస్‌ అనే చెప్పాలి కదా..! ఇంతకీ ఎక్కడా అనుకుంటున్నారా..?

గంజాయి ఆకు వాడకం, సాగు చేయడం నేరం. చాలా దేశాల్లో దీన్ని విక్రయించడం, మొక్కలను పెంచడంపై నిషేధం కూడా ఉంది. అయితే జర్మనీలో మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్దం. ఇక్కడ గంజాయి సాగు, విక్రయాన్ని దర్జాగా చేసుకోవచ్చు. జర్మనీలో గంజాయి వాడకాన్ని చట్టబద్దం చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లును మంత్రివర్గం ఆమోదించింది. దీంతో ఇకపై అక్కడ తక్కువ మోతాదులో గంజాయిని వాడవచ్చు. సాగు చేయవచ్చు. పబ్లిక్‌గా విక్రయించుకోవచ్చు.

తక్కువ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకోవడం, సాగు చేయడం చట్టబద్ధం చేసే బిల్లును జర్మన్ మంత్రివర్గం ఆమోదించింది. బిల్లులో పొందుపర్చినట్లుగా ఒక వయోజన వ్యక్తి 25 గ్రాముల (సుమారు ఒక ఔన్స్) గంజాయిని కలిగి ఉండటానికి, మూడు మొక్కల వరకు పెంచడానికి అనుమతిస్తుంది.

ఈ బిల్లు ప్రకారం.. ఇప్పుడు జర్మనీలోని గంజాయి క్లబ్‌ల నుంచి గంజాయిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే గంజాయిని పబ్లిక్‌గా విక్రయించే వాళ్లు, గంజాయి మొక్కలు సాగు చేసేవాళ్లు తప్పనిసరిగా లైసెన్స్ పొందిన గంజాయి క్లబ్‌లలో సభ్యులు అయి ఉండాలట.

ఈ గ్రూపుల్లో గరిష్టంగా 500 మంది సభ్యులు ఉండవచ్చు. కానీ చట్టం ప్రకారం సభ్యులకు 18 ఏళ్లు నిండి ఉండాలి. క్లబ్బులు, పాఠశాలలు, నర్సరీలు, ప్లే గ్రౌండ్స్‌లో మాత్రం దీన్ని ఉపయోగించడం ఖచ్చితంగా నిషేధించబడింది. అయితే ఒక వ్యక్తికి రోజుకు 25 గ్రాములు, నెలకు 50 గ్రాముల వరకు కొనుగోలు చేయడానికి అనుమతి ఉంది.

21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే మీరు 30 గ్రాముల గంజాయిని మాత్రమే పెద్ద మొత్తంలో కొనుగోలు చేయవచ్చు. ఇలాంటి షరతులతో కూడిన బిల్లును జర్మనీ మంత్రివర్గంలో ప్రవేశపెట్టడంతో ప్రభుత్వం ఆమోదించింది. గంజాయి విక్రయం, సాగును ప్రోత్సహిస్తోంది. జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ ఈ చట్టం బ్లాక్ మార్కెట్ అమ్మకాలను నిరోధించడం, చట్టవిరుద్ధమైన గంజాయి ఉత్పత్తుల నుండి వినియోగదారులను రక్షించడంతో పాటు మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరాలను పరిమితం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బిల్లు డ్రగ్ చట్టంలో ముఖ్యమైన మలుపు అని ఆ దేశ ఆరోగ్య మంత్రి కార్ల్ లాటర్‌బాచ్ అన్నారు.

ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి దీనిపై వివరణ ఇస్తూ తాము సమస్యను సృష్టించడానికి కాదని సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అయితే గంజాయిని చట్టబద్ధం చేయడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ చర్య ద్వారా ఎదురుదెబ్బ తగులుతుందని జర్మన్ న్యాయమూర్తుల సంఘం అభిప్రాయపడింది. చట్టాలు చాలా నిర్బంధంగా మారితే అది సాధారణ వినియోగదారుల ప్రతిష్టను దెబ్బతీస్తుంది. ఎంపిక చేసిన ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన వాణిజ్య పంపిణీ నెట్‌వర్క్‌లలో దీనిని పరీక్షించి అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తర్వాత దీనిపై పూర్తిగా స్టడీ చేసిన తర్వాత తమ విధానాన్ని అమలు చేయనుంది. ఇమాజిన్‌ ఓ చట్టం తెలుగు రాష్ట్రాల్లో వస్తే పరిస్థితి ఏంటో.?

Read more RELATED
Recommended to you

Latest news