దేశంలో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్న నేపధ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏ వలస వ్యతిరేక విధానం తో అయితే ఆయన అధికారంలోకి వచ్చారో అదే వలస విధానాన్ని ఇప్పుడు మరింత కఠినతరం చేసారు. ఇప్పటికే ఆయన 60 రోజుల పాటు ఇమ్మిగ్రేషన్ విధానాన్ని రద్దు చేసారు. అమెరికన్ల ఉద్యోగాలను కాపాడుకోవడానికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇక ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. పాటు వలసదారీ విధానాన్ని తాత్కాలికంగా రద్దు చేసిన ఆదేశంపై సంతకం చేసారు ట్రంప్. ఆ వెంటనే గ్రీన్ కార్డుల జారీని కూడా నిలిపివేస్తున్నట్లు ఆయన కీలక ప్రకటన చేసారు. 60 రోజుల పాటు వీటిని ఆపేస్తున్నామని చెప్పిన ఆయన… ఈ ఆదేశాల పత్రాలపై ఈ రోజు సంతకం చేయడానికి ఆయన రెడీ అయ్యారు. అమెరికన్ల ఉద్యోగాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నా అన్నారు.
60 రోజుల తర్వాత దీనిని పొడిగించాలా? సవరణలు చేయాలా? అనే దాని మీద విశ్లేషణ చేసి అప్పుడు నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో ఎక్కువగా ఉండే భారతీయులు శాశ్వత నివాసం కోరుకుంటారు. ఇప్పుడు వాళ్ళ మీద ఈ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అక్కడి విద్యార్ధులు ట్రంప్ సర్కార్ విధానం తో భారీగా నష్టపోతున్నారు. వలస చట్టం ప్రకారం ఆ దేశం ప్రతి ఏటా గరిష్ఠంగా 1.4 లక్షల గ్రీన్ కార్డులు ఇస్తుంది.