ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్నా సరే రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై ఆందోళన వ్యక్తమవుతుంది. అన్ని జిల్లాల్లో దాదాపుగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. జాగ్రత్తగా ఉండాల్సిన ఈ తరుణంలో అధికార పార్టీ నేతలు సమావేశాలు నిర్వహించడమే కాకుండా… సామాజిక దూరం లేని కార్యక్రమాలు నిర్వహించడం ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది.
తాజాగా మరో విషయం బయటకు వచ్చింది. ప్రకాశం జిల్లాలో ఒక సమావేశం నిర్వహించారు వైసీపీ నేత. ఈ విషయాన్ని టీడీపీ నేత, ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ వైసీపీ నేతలకు ఏమైంది అంటూ ఆయన పోస్ట్ చేసారు. శ్రీకాళహస్తిలో ట్రాక్టర్ ర్యాలీలు, నగరిలో ప్రారంభోత్సవాలు, మా నియోజకవర్గం లో సభలు, గుంటూరులో గెట్ టూ గెదర్ లు, వైజాగ్ లో రక్తదాన శిబిరాలు, శ్రీకాకుళం లో ట్రష్ట్ ప్రకటనా సభలు,
అంటూ టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి పోస్ట్ చేసారు. ఈనెల 20వ తేదీన ఈ కార్యక్రమం నిర్వహించారని టీడీపీ ఎమ్మెల్యే ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఆయన పోస్ట్ చేసారు. కొండెపి నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జి అయిన మాదాసి వెంకయ్య చీకట్లో వంద మందితో సభను నిర్వహించారని ఆయన పేర్కొన్నారు. దీనిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.