కరోనా నుండి రికవరీ అయిన వ్యక్తికి గ్రీన్ ఫంగస్..!

-

కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో ఇబ్బందులని మనం చూడాల్సి వస్తోంది. నిజంగా ఈ మహమ్మారి ఎందరో మందిని ఇప్పటికే పట్టి పీడించింది. ఇదిలా ఉంటే తాజాగా ఒక కొత్త గ్రీన్ ఫంగస్ కేసు నమోదయింది.

కరోనా నుండి రికవరీ అయిన 34 ఏళ్ల వ్యక్తికి గ్రీన్ ఫంగస్ వచ్చిందని తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే… మధ్యప్రదేశ్ ఇండోర్ నుండి ఎయిర్ అంబులెన్స్ ద్వారా ముంబై కి షిఫ్ట్ చేశారు అని మంగళవారం నాడు సీనియర్ డాక్టర్ చెప్పారు.

శ్రీ అరబిందో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరోనా నుండి ఆ వ్యక్తి కోలుకున్నాడు అని అయితే అతనికి బ్లాక్ ఫంగస్ వచ్చిందేమోనని డాక్టర్లు అనుకున్నారని చెప్పారు. టెస్ట్ చేసి చూడగానే అతనికి గ్రీన్ ఫంగస్ ఉన్నట్లు తేలింది.

సైనసిస్ మరియు బ్లడ్ లో ఈ ఫంగస్ వలన ఇన్ఫెక్ట్ అయ్యాడు. అయితే దీనికి సంబంధించి మరింత వివరాల కోసం రీసర్చ్ చేయాలి అని డాక్టర్లు అంటున్నారు. అయితే ఈ వ్యక్తి కరోనా బారిన పడ్డాక రెండు నెలల పాటు ఆసుపత్రి లో ఉన్నాడు. ఆ తర్వాత రికవరీ అయ్యాడు. కానీ జ్వరం ఎక్కువగా రావడం, ముక్కు నుంచి రక్తం కారడం, బరువు తగ్గడం లాంటి సమస్యలతో ఇబ్బంది పడ్డాడు అని డాక్టర్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version