చిత్తూరు: జిల్లాలో మామిడిపండ్లకు గిట్టుబాటు ధర పడిపోయింది. ఇంత కాలం పండ్లను కంటికి రెప్పలా కాపాడి అమ్ముకునేందుకు మార్కెట్‌కు తీసుకొచ్చిన రైతులకు తీవ్ర నిరాశ ఎదురైంది. కనీస ధర కూడా పలకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో తీసుకొచ్చిన మామిడిపళ్లను రోడ్డుపై పోసి నిరసన వ్యక్తం చేశారు. మరీ దారుణంగా రేటు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల నుంచి ట్రాక్టర్లతో తీసుకొచ్చి మామిడి పళ్లను గుట్టగుట్టలుగా రోడ్లపై పోసి వెళుతున్నారు.
చిత్తూరు జిల్లాలో రోడ్డుపై గుట్టలు గుట్టలుగా మామిడిపళ్లు
-