గ్రూప్‌-4 ప్రిలిమ్స్ ఫ‌లితాల‌ను విడుద‌ల

-

ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ శాఖలో గ్రూప్‌- 4 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గ్రూప్‌-4 జూనియర్‌ అసిస్టెంట్‌ నియామకాల కోసం ఏపీపీఎస్సీ ఈ ఏడాది జులై 31న నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ లో చెక్‌ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించినవారు మెయిన్స్‌ పరీక్ష రాయడానికి అర్హత సాధిస్తారు. ఈ క్రమంలో స్క్రీనింగ్‌ పరీక్షలో ఎంపికైన వారి వివరాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. కాగా ఏపీపీఎస్సీ గ్రూప్‌ 4 పరీక్షకు 2,11,341 మంది అభ్యర్ధులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వీరిలో 11,574 మంది అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్షకు అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. మెయిన్స్ ప‌రీక్ష‌ను ఎప్పుడు నిర్వ‌హించ‌నున్న విష‌యాన్ని త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్న‌ట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.

గ్రూప్-4 ఫలితాలతోపాటు, ఫైనల్ కీని కూడా ఏపీపీఎస్సీ విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో కీని అందుబాటులో ఉంచింది. ఆగస్టు 2న ప్రాథమిక కీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అభ్యంతరాలు స్వీకరణ అనంతరం అక్టోబరు 12న ఫైనల్ కీని విడుదల చేసింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version