నరేషా.. రసికుడవేనయ్యో.. పవిత్రను కాదని ఇంకో అమ్మాయితో రొమాన్స్..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ సీనియర్ హీరో నరేష్.. సినీ ఇండస్ట్రీలో ఎంత పాపులారిటీ అయితే సంపాదించుకున్నారో.. వ్యక్తిగత జీవితంలో అంతే వివాదాలకు చోటు ఇచ్చాడు . ఏకంగా మూడు వివాహాలు చేసుకున్న నరేష్ ముగ్గురు భార్యలను కాదనుకొని ఆ తర్వాత ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ తో సహజీవనం చేసిన విషయం తెలిసిందే. గత కొంతకాలం నుంచి వీరిద్దరి మధ్య సహజీవనం జరుగుతుందని .. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి తనకు విడాకులు ఇవ్వకుండా నాలుగవ వివాహం ఎలా చేసుకుంటావు అంటూ కూడా నరేష్ ను నిలదీసింది.

అటు పవిత్ర లోకేష్ భర్త కూడా ఇద్దరు పిల్లలు జన్మించిన తర్వాత తన భార్య ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావడం లేదు అంటూ మీడియా ముందుకు వచ్చి తన ఆవేదన వ్యక్తం చేశాడు. కానీ పవిత్ర లోకేష్ మాత్రం తాము సహజీవనం చేస్తున్నామని , త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాము అని , అంతేకాదు తమకు కృష్ణ సపోర్టు కూడా ఉందని .. దయచేసి సపోర్ట్ చేయాలని కూడా కోరారు. అయితే రమ్య రఘుపతి మాత్రం ఇందుకు అంగీకరించలేదు. ఒకసారి బెంగళూరు హోటల్లో రెడ్ హ్యాండెడ్ గా పవిత్ర లోకేష్ , నరేష్ ను మీడియాకు పట్టించి .. పవిత్రను చెప్పుతో కొట్టే ప్రయత్నం చేసింది. అంతేకాదు తెలుగు మీడియా ముందు కాకుండా కన్నడ మీడియా ముందు పవిత్ర లోకేష్ పై ఆరోపణలు చేసి ఆమెను ఇరుకున పెట్టింది.

ఇక ఇంత రాద్ధాంతం జరిగిన తర్వాత వీరిద్దరి వివాహం చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. నరేష్ పవిత్ర లోకేష్ ను పక్కనపెట్టి ఇంకొక అమ్మాయితో రాసలీలలు నడుపుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ నరేష్ పై వస్తున్న వార్తలు చూసి నరేష్ నిజంగానే నువ్వు రసికుడవే అంటూ కొంతమంది నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version