వైసీపీలో పెరుగుతున్న అసంతృప్తులు..పలు జిల్లాలో వర్గ విభేదాలు.

-

గత ఎన్నికల్లో ఏపీలో వైసీపీ తిరుగులేని విజయం సాధించింది..ఎన్నో లక్ష్యాలతో జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు..పాదయాత్రలో ఇచ్చిన హామీలను నవర్నాల పేరుతో అములు చేస్తున్నారు..ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు రాష్ట్రానికి ఉన్న సంక్షేమ పథకాల అమలు మాత్రం ఆపడం లేదు జగన్‌..మాట తప్పను మడమ తిప్పను అన్న మాటకు జగన్ కట్టుబడి ఉన్నారు..ఇచ్చిన అన్ని హామీలను వన్‌ బై వన్ అమలు చేస్తున్నారు..ఏపీ వైఎస్‌ఆర్‌ తర్వాత ఆ స్థాయిలో ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నారు సీఎం జగన్..సంక్షేమ పథకాల అమలులో ఎటువంటి ఇబ్బందులు లేకపోయినప్పటికి..సొంత పార్టీ నేతల తీరుతో ఇప్పుడు జగన్‌కు కొత్త తలనోప్పులు వస్తున్నాయి..అసంతృప్తులతో రాష్ట్రంలో పలు జిల్లాలో నేతల మధ్య వర్గ విభేదాలు బయటపడుతున్నాయి.
అనేక జిల్లాల్లో వర్గపోరుతో సతమతమవుతున్న వైసీపీలో కొన్నిచోట్ల నేతల మధ్య విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి..కడప ,గుంటూరు, శ్రీకాకుళం మొదలుకొని కోస్తా వరకూ అన్ని జిల్లాలో వర్గ విభేదాలు బయటపడుతున్నాయి..అటు విశాఖ, ఇటు తూర్పుగోదావరి. రెండు జిల్లాల్లోనూ వైసీపీలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. విశాఖలో వైసీపీ నాయకులు రోడ్డునపడి కొట్టుకోగా..తూర్పుగోదావరిలో అదే పార్టీ నేతలు DRC సమావేశంలో వాగ్వాదానికి దిగారు. వీటిపై ట్విట్టర్లో స్పందించిన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ ఘాటు కామెంట్లు పెట్టారు.తూర్పుగోదావరి జిల్లా సమీక్షా సమావేశంలో అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. టిడ్కో ఇళ్ళ కేటాయింపుల్లో లక్షల రూపాయల వసూళ్లకు పాల్పడుతున్నారని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అభ్యంతరం తెలపడంతో ఇద్దరు నేతలు మధ్య వాగ్వాదం నడిచింది. ఎలా వసూలు చేశారు? ఎవరు చేశారో చెప్పాలని ద్వారంపూడి డిమాండ్ చేశారు. ఇళ్ల నిర్మాణం టీడీపీ హయాంలో జరిగిందని ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యాఖ్యానించడంతో ఆ పార్టీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప జోక్యం చేసుకున్నారు. ఇప్పుడు అధికారంలో ఉంది మీరే కదా? అంటూ కౌంటర్‌ ఇచ్చారు..విశాఖలోనూ వైసీపీలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. గాజువాకలో మల్కాపురం వద్ద నడిరోడ్డుపై బాహాబాహీకి దిగారు కార్పొరేట్ అభ్యర్థి పి.వి.సురేష్, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ. ఇద్దరు నేతలు తిట్ల దండకం అందుకున్నారు. ఎన్నికల తర్వాత వైసీపీలో చేరి ఇటీవల జివిఎంసి ఎన్నికల కోసం కార్పొరేటర్ టికెట్ సాధించుకున్నారు పి.వి.సురేష్. అయితే ఆదివారం సమావేశానికి ఎందుకు ఆహ్వానించలేదని దాడి సత్యనారాయణ.. సురేశ్‌ను ప్రశ్నించడంతో గొడవ మొదలైంది. ఇద్దరూ ఒకర్నొకరు చొక్కాలు పట్టుకోవడంతో..గొడవ పెద్దది కాకుండా ఇద్దర్నీ పక్కకు తీసుకెళ్లిపోయారు పార్టీ నాయకులు.

జమ్మలమడుగు కడప జిల్లాలో పులివెందుల తర్వాత అత్యంత రాజకీయ ప్రాధాన్యం ఉన్న నియోజకవర్గం ప్రస్తుతం అక్కడ నేతల మధ్య ఆధిపత్య పోరు అధికార పార్టీకి తలనొప్పిగా మారుతోంది.. జమ్మలమడుగులో రాజకీయాలను నాలుగు దశాబ్దాలుగా మాజీ మంత్రులు ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి కుటుంబాలే శాసించాయి. ఈ ఆధిపత్య పోరు పార్టీ శ్రేణులు, అధికారులకు ఇబ్బందిగా మారిందట..వైసీపీలో విభేదాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ట్విట్టర్లో స్పందించారు. వీధి రౌడీలు ప్రజా ప్రతినిధులు అయితే ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదమో..తూర్పుగోదావరి జిల్లా సమీక్షా సమావేశం జరిగిన తీరు చూస్తే అర్థమవుతోందని ఘాటు కామెంట్లతో ట్వీట్‌ చేశారు. వైసీపీ అధినేత నుంచి MLAల దాకా అభివృద్ధిపై సమాధానం చెప్పలేక..నోటికి పనిచెబుతున్నారని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ ట్వీట్‌ చేశారు.ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొద్ది నెలల్లోనే వైసీపీలో అంతర్గత కుమ్ములాటను టీడీపీ అధినేత క్లోజ్‌గా పరీశీలిస్తున్నారు..రాజకీయంగా ఎలా ఉపయోగించుకోవాలో పార్టీ నేతలకు ప్రతి రోజు టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్‌తో దిశా నిర్ధేశం చేస్తున్నారు.. అవరమైన చోట ఫిరాయింపులను కూడా ప్రోత్సహించాలని సూచించినట్లు సమాచారం..మరోవైపు పాలనపై దృష్టి పెట్టిన సీఎం జగన్‌..పార్టీ నేతల మధ్య కుమ్ములాటను సీరియస్‌గా తీసుకోవడం లేదనే విమర్శ కూడా వస్తుంది..ఒకే వైపు స్థానిక సంస్థల ఎన్నికలపై ఎస్‌ఈసీ, సీఎస్‌,వైసీపీ నేతల మధ్య ట్రై యాంగిల్ యుధ్దం నడుస్తుంది..రాజధాని వివాదం కూడా ఇప్పుడు ప్రభుత్వం,ముఖ్యంగా జగన్‌ ముందు సవాల్‌ మారింది..ఈ సమస్యలను పరిష్కరించడం జగన్ తక్షణ కర్తవ్యంగా ఉండాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు..సమస్యలను పరిష్కరించడంతో నిర్లక్ష్యం చేస్తే అది విపక్షాలకు ఎన్నికల ఆయుధాలను అందించినట్లే అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version