టెస్లా సహ వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ బిల్ గేట్స్ ను తన సంపాదనలో క్రాస్ చేశారు. దీంతో ప్రపంచంలో రెండవ ధనవంతుడైన వ్యక్తిగా ఎలోన్ మస్క్ ఇప్పుడు అవతరించారు. 49 ఏళ్ల ఈ ఎలోన్ మస్క్ నికర విలువ 7.2 బిలియన్ డాలర్లకు పెరిగి 127.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ నేపధ్యంలో ఇప్పుడు టెస్లా షేర్ ధరలో కూడా పెరుగుదల కనిపించింది. మస్క్ ఈ సంవత్సరం తన నికర విలువకు $100.3 బిలియన్లను చేర్చుకున్నాడు.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ కి సంబంధించి ఆయన జనవరిలో 35 వ స్థానంలో ఉన్నాడు. సంపద ర్యాంకుల్లో అతని పురోగతి ఎక్కువగా టెస్లా వల్లే అని చెప్పక తప్పదు. దీని మార్కెట్ విలువ 500 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ఇక ఆయన నికర విలువలో మూడొంతుల భాగం టెస్లా షేర్లతో కూడి ఉంది. ఇవి స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్ లేదా స్పేస్‌ఎక్స్‌లో అతని వాటా కంటే నాలుగు రెట్లు ఎక్కువ విలువైనవి.