చంద్రబాబుకు జనసేన సైనికులు బానిసలుగా బతకాలి – గుడివాడ అమర్నాథ్

-

పవన్ కళ్యాణ్ కంటే KA పాల్ బెటర్..175 సీట్లల్లో పోటీ చేస్తాడని మంత్రి గుడివాడ అమర్నాథ్ హాట్‌ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ కోసం కాపులు సమావేశం పెట్టినట్లు చిత్రీకరిస్తున్నారని.. అన్ని వర్గాలతో మేము తరచు సమావేశాలు నిర్వహించుకున్నామని తెలిపారు. జనసేన పొలిటికల్ పార్టీ కాదు సినిమా పార్టీ అని.. విధానం సిద్ధాంతం లేని జనసేన పార్టీ అని చురకలు అంటించారు.

దాని గురించి మేము మాట్లాడవలసిన అవసరం లేదని.. సినిమాల్లో ఉన్న వ్యక్తి సినిమా స్టైల్ లో మాట్లాడితే సినిమాల్లో పనికొస్తుంది. ప్రజాస్వామ్యంలో పనికిరాదని విమర్శలు చేశారు. దీన్ని సమాజం ఖండించాల్సిన అవసరం ఉందని.. పవన్ కళ్యాణ్ పదిమందితో ప్రభుత్వం వస్తుందా? అని ఆగ్రహించారు.

జనసేన నేతలు కార్యకర్తలు పవన్ ముఖ్యమంత్రి కావాలనుకుంటే, పవన్ మాత్రం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారని.. రేపు చంద్రబాబుకి జనసేన సైనికులు బానిసలుగా బతకాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కంటే కేఏ పాల్ నయం.175 సీట్లు పోటీ చేస్తున్నది చెప్తున్నాడు…చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలియక ఎప్పుడో ఊహించినదే. వారు కలవడం విడిపోవడం సహజమేన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version