కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి తాజాగా యువ లీడర్, హార్దిక్ పటేల్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదికగా.. రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గత కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ అధిష్టానం పై గుర్రుగా ఉన్న హార్దిక్ పటేల్.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హార్దిక్ పటేల్ గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీకి రాజనామా చేస్తూ.. “ఈరోజు కాంగ్రెస్ పార్టీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ధైర్యంగా రాజీనామా చేస్తున్నాను. నా నిర్ణయాన్ని నా సహచరులు మరియు గుజరాత్ ప్రజలందరూ స్వాగతిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నా ఈ దశ తర్వాత నేను భవిష్యత్తులో గుజరాత్ కోసం నిజంగా సానుకూలంగా పని చేయగలనని నేను నమ్ముతున్నాను. “అంటూ హర్దిక్ పటేల్ ట్వీట్ చేశారు. అయితే… కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన హార్దిక్ పటేల్.. తన భవిష్యత్తు కార్యచరణపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
आज मैं हिम्मत करके कांग्रेस पार्टी के पद और पार्टी की प्राथमिक सदस्यता से इस्तीफा देता हूँ। मुझे विश्वास है कि मेरे इस निर्णय का स्वागत मेरा हर साथी और गुजरात की जनता करेगी। मैं मानता हूं कि मेरे इस कदम के बाद मैं भविष्य में गुजरात के लिए सच में सकारात्मक रूप से कार्य कर पाऊँगा। pic.twitter.com/MG32gjrMiY
— Hardik Patel (@HardikPatel_) May 18, 2022