ఈ మధ్యన వరుసగా అమెరికాలో కారణాలు ఏమైనా కాల్పులు జరుగుతూ దారుణ పరిస్థితులను తెచ్చాయి అని చెప్పాలి. తాజాగా అమెరికాలోని ఫిలడెల్పియా వారింగ్టన్ లో అవెన్యూ లో ఉన్న 5700 బ్లాక్ లో గత రాత్రి కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల ఘటనతో మిగిలిన ప్లాట్ లలో ఉన్న వారు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ కాల్పులలో మొత్తం నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఇంకా నలుగురు గాయాలపాలయ్యారు. అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే చనిపోయిన వారిలో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఈ దారుణమైన ఘటన జరిగిన కొంతసేపటికి ఆ ఘాతుకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీసులు ఇతని దగ్గర నుండి ఒక రైఫిల్ మరియు ఒక తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక అధికారులు తెలియచేశారు. కాగా ఈ ఘటనపై కారణాలు ఏమిటన్నది తెలియాల్సి ఉంది.
అమెరికాలో కాల్పులు నలుగురు అమాయకులు స్పాట్ డెడ్…
-