బ్రేకింగ్; డిఎస్పీ కాలర్ పట్టుకున్న టీడీపీ లీడర్…!

-

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలి అంటూ రాజధాని జిల్లా అయినా గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున అక్కడి ప్రజలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. రాజధాని గ్రామాల్లో గత 36 రోజుల నుంచి ఆ ప్రాంత రైతులు మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇక శాసన సభలో వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత పరిస్థితులు కాస్త తీవ్రంగా మారాయి.

రాజధాని గ్రామాల రైతులతో పాటుగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ఈ నేపధ్యంలో అమరావతి పరిరక్షణ సమితి బుధవారం గుంటూరు బంద్ కి పిలుపునిచ్చింది. దీనితో గుంటూరులో భారీగా పోలీసులు మొహరించారు. దీనికి తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. బంద్ నేపథ్యంలో రోడ్డుపై టీడీపీ, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

ఇరువర్గాలు నడిరోడ్డు మీద ఘర్షణకు దిగాయి. ఈ గొడవలో టీడీపీ నేతలు పోలీసులపై చేయి చేసుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణ౦ నెలకొంది. డీఎస్పీ సీతరామయ్య కాలర్‌ను తెలుగుదేశం నేత ఒకరు పట్టుకోవడంతో ఘర్షణ తీవ్రమై౦ది. దీనితో పోలీసు పోలీసులు బంద్ కి మద్దతుగా వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నం చేసారు. అయితే అసలు ఈ బంద్ కి,

అనుమతి లేదని జిల్లా పోలీసులు చెబుతున్నారు. ఎవరైనా బలవంతంగా దుకాణాలు మూసివేయిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుంటూరు రూరల్ పరిధుల్లో విద్యార్ధులకు, ఉద్యోగులకు, సాధారణ ప్రజలకు బంద్ కారణంగా ఇబ్బందులు కలుగుతాయ౦టున్న పోలీసులు, ఎవరూ ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు నిర్వహించరాదని, బలవంతంగా షాపులు, విద్యాసంస్థలు మూయించడం చేయరాదని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version