తాడికొండ వైసీపీ ఎమ్యెల్యే శ్రీదేవి వివాదంలో చిక్కుకున్నారు. ఉండవల్లి శ్రీదేవీ సామాజిక వర్గంపై విచారణ సాగుతుందని గుంటూరు జిల్లా పోలీసులు వెల్లడించారు. శ్రీదేవీ ఎస్సీ సామాజిక వర్గం కాదంటూ గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ ఫిర్యాదు అందింది. దీనిపై తమ ముందు హాజరుకావాలంటూ శ్రీదేవీకి జేసీ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 26 న మధ్యాహ్నం 3 గంటలకు హాజరుకావాలని స్పష్టం చేశారు. ఎస్సీ అని నిరూపించేందుకు అవసరమైన పత్రాలు, ఆధారాలతో విచారణకు రావాలని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ ఎమ్మెల్యేకు సూచించారు.
వాస్తవానికి ఓ ఇంటర్వ్యూలో తాను క్రిస్టియన్ అని శ్రీదేవి చెప్పుకున్నారు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తరపున సంతోశ్ అనే వ్యక్తి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేశారు. క్రిస్టియన్ అయిన శ్రీదేవికి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అర్హత లేదని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం… ఈ అంశంపై విచారణ జరపాలంటూ ఎన్నికల కమిషన్ కు ఆదేశాలు జారీ చేసింది.