త్రివిక్రమ్ – మహేష్ కాంబో: ఫస్ట్ సాంగ్ “ధమ్ మసాలా” విడుదల రేపే !

-

ప్రిన్స్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మోస్ట్ వాంటెడ్ మూవీ “గుంటూరు కారం”, ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. కాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ ను రేపు విడుదల చేస్తున్నాం అంటూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది గుంటూరు కారం టీం. మొన్ననే గుంటూరు కారం మూవీలోని ఫస్ట్ సాంగ్ ధమ్ మసాలా ప్రోమో ను విడుదల చేయగా, ఇప్పుడు అది యు ట్యూబ్ ను షేక్ చేస్తోంది. కేవలం ప్రోమో కె ఆ రేంజ్ లో క్రేజ్ ఉంటే , ఫుల్ సాంగ్ వస్తే ఎంతలా ఉంటుందో అంటూ మేకర్స్ ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేసే అప్డేట్ ను ఇచ్చారు. ఈ అప్డేట్ ప్రకారం రేపు సాయంత్రం 4 .05 గంటలకు ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు.

ఇక ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక మహేష్ బాబు సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా కావడంతో అభిమానుల్లో చాలా ఆసక్తితో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version