గుప్పెడంతమనసు ఎపిసోడ్ 269: దేవయాని వలలో చిక్కుకున్న జగతి..కాలేజ్ నుంచి శాశ్వతంగా తల్లిని వెళ్లిపోమన్న రిషీ

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో రిషీ సగంలోనే తినకుండా వెళ్లిపోతాడు. దేవయాని ఎందుకండి తనని బాధపడతారు అంటుంది. ఫణీంద్ర తన భోజనం అయిపోయిందని చెప్పాడుకదా దేవయానితో సీరియస్ గా చెప్తాడు. అయిపోయింది భోజనం కాదండి..ఆ జగతి పని అనుకుంటుంది. ఇంకోసీన్ లో వసూ రిషీ కట్టిన కట్టు చూసుకుంటూ రిషీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. జగతి వచ్చి నొప్పిగా ఉందా అని అడుగుతుంది. లేదు మోడమ్..రిషీ సారే అనవసరంగా పెద్దకట్టు కట్టారు..ఇలా కట్టినప్పుడే నొప్పి తగ్గుతుంది.వెళ్లి పడుకో అంటుంది..ఇంతలో రిషీ ఫోన్ చేస్తాడు..జగతి చూసి ఏముంది రేపు ఇంటర్వూ గురించి, నీ చేయి ఎలా ఉంది అని అడగటానికే ఫోన్ చేసి ఉంటాడు. ఆ ఇంటర్వూ అంతా మేం చూసుకుంటాంలో మీరేం టెన్షన్ పడకండి అని చెప్పు అంటుంది. మేడమ్ అలా అంతా మేం చూసుకుంటాం అంటే నేను కాలేజ్ కి రావొద్దా అంటారు. రిషీ సార్ తో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అంటుంది వసూ. నా కొడుకు గురించి బానే అర్థం చేసుకున్నావ్ అంటుంది జగతి.
ఇటుపక్క రిషీ ఫోన్ చేస్తే తియ్యదేంటి..ఫోన్ ఎక్కడో పెట్టి తనెక్కడో కుర్చుంటుంది అనుకుంటూ మళ్లీ కాల్ చేస్తాడు. జగతి నవ్వుకుంటూ వెళ్లిపోతుంది. వసూ లిఫ్ట్ చేస్తుంది. రిషీ వెంటనే చెయ్యి ఎలా ఉంది, తిన్నావా, నొప్పి తగ్గిందా అంటూ లొడాలొడా మాట్లేడేస్తాడు. సార్ తగ్గింది, తిన్నాను..ఇందాక జగతి మోడమ్ తో రేపటి ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్నాను ఇంతలో మీరు ఫోన్ చేసారు..ఓహో అప్పుడే డిసైడ్ అయిపోయారా ఏం చేయాలో సరే కానివ్వండి..నొప్పి తగ్గిందిగా బాయ్ అని పెట్టేస్తాడు.
కట్ చేస్తే తెల్లారి జగతి, వసూ రెడీ అవుతారు. కాలేజ్ కి వెళ్లేలోపు దేవయాని కాలే చేసి నీతో రిషీ గురించి మాట్లాడాలి అని చెప్తుంది. వసూ ఒక్కతే కాలేజ్ కి వెళ్తుంది. జగతి దేవయానిని కలవడానికి వెళ్తుంది. కాలేజ్ లో ఛానల్ వాళ్లు వచ్చేదానికి అందరూ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మహేంద్ర వచ్చి మీకు ఏమైనా హెల్ప్ చేయాలా అంటే..అవసరంలేదు డాడ్ అంటాడు..అయినా మిషన్ ఎడ్యుకేషన్, ఎడ్యూకల్చర్ లో మనపనేం లేదు అంతా జగతి అని చెప్పబోయి..మళ్లీ ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తాడు. మీరు ఏం చెప్పి కవర్ చేయాలనుకుంటుననారో నాకు అర్థమయిందిలే అని వెళ్లిపోతాడు. ఆ తర్వాత వసూ వస్తుంది. మహేంద్రను పలకరిస్తుంది..ఏంటి నువ్వు ఒక్కదానివే వచ్చావ్,మీ గురువు రాలేదా అంటే..ఏదో పని ఉందని ఆగారు..వస్తారు సార్ అంటుంది.
ఇంకోవైపు దేవయాని, జగతి ఒక దగ్గర మీట్ అవుతారు. దేవయాని కావాలనే జగతిని తప్పించాలనే ఇలా చేసింది. స్టైట్ గా పాయింట్ కి వస్తున్నాను అంటూ..ఈరోజు నువ్వు కాలేజ్ కి వెళ్లకూడదని బిల్డప్ ఇస్తుంది దేవయాని. జగతి అక్కయ్య ఇది మీ ఇల్లు కాదు, పెత్తనాలు చేయాటానికి అంటుంది జగతి. నాకు తెలుసు నువ్వు ఇలానే మాట్లాడతావ్ అని, నువ్వు ఈరోజు కాలేజి వెళ్లటం రిషీకి ఇష్టం లేదు అంటుంది దేవయాని. రిషీకా మీకా..మీ క‍డుపుమంటకి, స్వార్థానికి రిషీని ఎందుకు వాడుకుంటున్నారు అంటుంది జగతి. దేవయాని కోపంగా చూస్తుంది. నువ్వు కోపంగా చూస్తే భయపడే ఒకప్పటి జగతిని కాదు, అప్పుడు కూడా నేను భయపడలేదు..కుటుంబ గౌరవానికి తలవంచాను అప్పుడు నేను జగతినే కానీ ఇప్పుడు జగతిమేడమ్ అంటూ గర్వంగా చెప్తుంది. దేవయాని నువ్వు కాలేజ్ కి వెళ్లటానికి వీళ్లేదు. వాళ్లు నిన్న పొగడటం నాకు ఇష్టంలేదు అంటూ ఏదేఏదో వాగుతుంది. కాలేజ్ కి మీరు చెప్తే రాలేదు..అందరూ ఫోర్స్ చేస్తే వచ్చాను అంటుంది జగతి.
దేవయాని నువ్వు రిషీని దాటి పేరుతెచ్చుకుంటున్నావ్ అది నాకు ఇష్టం లేదు. అదిఇది అనుకుంటూ ఎలా అయినా దేవయాని జగతిని ఆపాలని చూస్తుంది. జగతి మీ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసు నాకు..మీ ఆలోచనలను రిషీ మీద రుద్దకండి అంటుంది. దేవయాని నువ్వు కాలేజ్ కి వెళ్తే మీడియాకు నువ్వు మహేంద్ర భార్యవని, రిషీ తల్లివని తెలిసిపోతుంది..అది రిషీకి ఇష్టం ఉండదు..ఈ ఒక్కకారణంతో అయినా ఆగిపో అంటుంది. జగతి వీటికి గట్టిగా సమాధానం ఇచ్చి..మీడియా ముందు నుల్చుని మహేంద్రభూషన్ నా భర్త..రిషేంద్రభూషన్ నా కొడుకు అని చెప్తాను. ఎ‌వరు ఆపగలరు, మీరు ఆపగలరా అంటూ కౌంటర్ ఇస్తుంది. కానీ నేను అలా చెప్పను, నా కొడుకు తనంతట తాను అమ్మా అని పిలిచేవరకూ నేను బయటపడను..దానికోసమే 20ఏళ్లగా ఎదురుచూస్తున్నాను అని చెప్పి వెళ్లిపోతుంది.
దేవయాని మనసులో జగతి నిన్ను రెచ్చగొడితే నువ్వేం మాట్లడతావో నాకు తెలుసు..నేను వేసిన వలలో చిక్కుకున్నావ్ అంటూ డ్రైవర్ వైపు చూస్తుంది. డ్రైవర్ అదంతా వీడియో తీసినట్లు ఉన్నాడు. ఇంకోసీన్ లో వసూ రెండు స్టూల్స్ వేసుకుని వాటిపై ఎక్కిమరీ బ్యానర్ కడుతుంది. ఇంతలో రిషీ వస్తాడు. వసూ సార్ ఓకేనా ఇదంతా అంటుంది. అది ఓకే నువ్వే నాట్ ఓకే..జాగ్రత్త అంటాడు. నేను ఓకే సార్..చిన్నప్పుడు మా ఊర్లో చెట్లెక్కడంలో నేనే నంబర్ వన్ సార్ అంటుంది. ఇంతలోనే పడిపోతుంది. రిషీ పట్టుకుంటాడు. స్టూడెంట్స్ అంతా నోరువెళ్లబెడతారు. వసూరిషీ మాత్రం ఒకరికళ్లలోకి ఒకరు చూస్తూ అలానే ఉండిపోతారు. కాసేపటికి దించి సార్ నేను కిందపడ్డానా అంటుంది వసూ. నువ్వెందుకు పడతావ్ నువ్వు మీ ఊర్లోచెట్లెక్కటంలో నంబర్ వన్ కదా అంటాడు..దేవయాని రిషీకి ఫోన్ చేస్తుంది. రిషీ వెళ్లిపోతాడు. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
తరువాయిభాగంలో దేవయాని రిషీకి వీడియో పంపుతుంది. కరెక్ట్ గా జగతి మీడియా ముందు నుల్చుని రిషేంద్రభూషన్ నా కొడుకు, మహేంద్రభూషన్ నా భర్త అన్న క్లిప్ వరకే పంపుతుంది. రిషీ జగతిని క్యాబిన్ కి పిలిపించి ఏంటిది, బంధాలతో బెదిరించాలని చూస్తున్నారా మేడమ్..మీరు ఇక్కడినుంచి వెళ్లిపోండి శాశ్వతంగా అంటాడు. మరోసీన్ లో వసూ జగతి మేడమ్ రాలేదు అని మహేంద్రకు చెప్పి కంగారు పడుతుంది. చూద్దాం జగతి శాశ్వతంగానే వెళ్లిపోయిందేమే.

Read more RELATED
Recommended to you

Exit mobile version