గుప్పెడంతమనసు ఎపిసోడ్ 286: పక్కసీట్ లో వసూలేదని..వసూ ఫొటో పెట్టుకుని మరీ తన మనసులో మాటలు చెప్తున్న రిషీ

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో ధరణి పనిచేసుకుంటూ ఉంటుంది. దేవయాని వస్తుంది. ధరణి అత్తయ్యగారు కాఫీ ఎమన్నాకావాలా అంటుంది. దేవయాని ఏంటి నీ ఉద్దేశం నేను కాఫీ నీళ్లు తాగటానికే పుట్టా అనుకున్నావా..అదిసర్లేకానీ..రాత్రి మహేంద్రగదిలో ఏంటి మంతనాలు, ఏం మాట్లాడుకున్నారో చెప్పు అంటుంది. ధరణి..రిషీకి వసుధార మీద ఎందుకో తెలియదు కానీ చాలా కోపం వచ్చింది, అదే విషయం మవయ్యగారిని అడిగాను అంటుంది. దేవయాని చాలా మంచివిషయం, మహేంద్ర ఏమన్నాడు అంటుంది. మావయ్యగారు కూడా తెలియదు అన్నారు అంటుంది ధరణి. దేవయానికి చాలా హ్యాపీ..వసుధార దూరమవుతుందంటే చాలా మంచివిషయం..వెళ్లి స్వీట్ చేయ్ అంటుంది.

ఇంకోసీన్ లో వసూ కాలేజ్ లో రిషీ సార్ కి నామీద కోపం ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ..రిషీకి మెసేజ్ చేస్తుంది. అప్పుడే రిషీ కారులో వెళ్తుంటే..వసూ అడ్డంగా వెళ్లి నిలబడుతుంది. రిషీ కారులోంచి దిగి..ఏయ్..కారుకు అడ్డంగా నిల్చున్నావ్, ధర్నాలు, రాస్తారోకోలు ఏమన్నా చేస్తావా అంటాడు. వసూ సార్ నామీద కోపం ఏంటిసార్ మీకు, నాకెందుకు వర్క్ ఇవ్వటంలేదు. కావాలనే నన్ను అవైడ్ చేస్తున్నారు అంటుంది . ఇప్పుడు కారుకు అడ్డం ఎందుకు వచ్చావ్, లిఫ్ట్ కావాలా అంటాడు. వసూ వద్దుసార్, క్లారిటీ కావాలి అంటుంది. ఆ మెసేజ్ ఏంటి..నా మీద కోపం ఎందుకు వచ్చిందని, నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇ‌వ్వాలా అంటాడు రిషీ. నాకు వర్క్ ఎందుకు ఇవ్వటం లేదు అంటే..నువ్వు ఇంటర్వూలో హ్యాండ్ ఇచ్చినట్లు ఇది కూడా లాస్ట్ మినిట్ లో ఎగ్గొడితే..అందుకో వేరేవాళ్లకు ఇచ్చాను..అయినా నా వర్క్ నా ఇష్టం..నా పాత అసిస్టెంట్ హ్యాండ్ ఇస్తుందిలే ఈ మధ్య అని కారు దగ్గరకు వెళ్తాడు..లిఫ్ట్ ఏమైనా కావాలా అని అడిగి మళ్లీ..అయినా ఇప్పుడు నీ రూట్ నా రూట్ మారిందిలే..నేను నీకు లిఫ్ట్ ఇవ్వలేను అని కారులో కుర్చుంటాడు. లోపల కుర్చుని..నేను వెళ్లొచ్చా, కారు వెనుక పరిగెత్తే కార్యక్రమాలను ఏమైనా ఉన్నాయా అంటాడు. వసూ ఏం మాట్లాడదు. రిషీ వెళ్లిపోతాడు. వసూ అలానే నుల్చుంటుంది.

అప్పుడే జగతి, మహేంద్రలు వస్తారు. జగతి వసూ నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నాం, రెస్టారెంట్ డ్యూటీలేదా ఈరోజు అంటే..ఉంది మేడమ్..ఆలోచిస్తున్నాను అంటుంది. ఈ మధ్య నీకు ఆలోచనలు ఎక్కువయ్యాయి, ఏంటి నీ ప్రాబ్లమ్ అంటుంది జగతి. రిషీ సార్ నా మీద కోపంగా ఉన్నారు అంటుంది వసూ. రిషీకి కోపం వచ్చిందంటే..అది రిషీ ప్రాబ్లమ్, నీది కాదు..అంతేకానీ నువ్వు ఆలోచించు తలనొప్పి తెచ్చుకోకు అంటుంది. నీకు డ్యూటికి వెళ్లే మూడ్ ఉంటే డ్యూటీకి వెళ్లు, లేదంటే ఇంటికిరా అంతేకానీ వేరేమాట చెప్పకు అంటుంది.

కట్ చేస్తే..రిషీ కారులో వెళ్తూ.. గతంలో వసూ పక్కన కుర్చున్న సీన్స్ గుర్తుచేసుకుని..ఫోనులో వసూ ఉన్న ఫొటోను పక్కన సీటులో పెట్టి..చాలా సందర్భాల్లో నా పక్కనే కుర్చుకున్నాం, ఇప్పుడు వెళ్లిపోతున్నావా వసుధార, నీ మీద నాకు అభిప్రాయాలు చాలా త్వరరగా మారిపోయాయి..కొన్ని చెప్పగలిగాను, కొన్ని చెప్పటానికి మాటలు రాలేదు అంనుకుంటాడు. అలా వసూను తలుచుకుంటూ..డైవింగ్ చేస్తాడు. గతంలో వసూకి ఉన్న జ్ఞాపకాలన్నీటితో మన ఎడిటర్ ఒక మంచిపాట వేస్తాడు. ఇన్ని జరిగాయ వీళ్ల మధ్య అనిపిస్తుంది. రిషీ అలా వసూ గురించి ఆలోచిస్తూ.. తెలియకుండానే వసూ పనిచేసే రెస్టారెంట్ కి వెళ్తాడు. నేనేంటి ఇక్కడికి వచ్చాను అనుకుంటూ ఉంటాడు. అప్పుడే వసూ వస్తుంది. కానీ రీషీ వెంటనే వెళ్లిపోతాడు. ఎవరూ చూసుకోరు.

ఆరోజు రాత్రి దేవయాని ఫణీంద్ర పక్కన కుర్చుంటుంది. పక్కన వచ్చి కుర్చున్నాను..నాతో రెండుమూడు మాటలు మాట్లాడొచ్చుగా అంటుంది. నువ్వేం చెప్తావో నాకు తెలుసు దేవయాని అంటాడు ఫణీంద్ర. దేవయాని..కొంతకాలంగా రిషీ డల్ గా ఉన్నాడు, అలా ఎందుకు ఉన్నాడో కనుక్కోవచ్చుగా అంటుంది. నాకు అలా అనిపించలేదే అంటాడు ఫణీంద్ర. అదే కనుక్కోండి అని దేవయాని అంటే..ఫణీంద్ర ఇంట్లో ఖాళీగా ఉంటావ్, పనిపాట ఏం ఉండదు..ఊరికే ఉన్నవిలేనివి ఆలోచించి నాకు చెప్తావ్..ఏమన్నా అంటే చిరాకుపడుతున్నా అంటావ్ అంటాడు. మీకు ఏం చెప్పినా ఇంతేలే అంటుంది ఇంతలో రిషీ వస్తే నాన్న రిషీ అంటూ పిలుస్తుంది. తిన్నావా, అంతాబాగేనే అంటుంది. ఏంటి కొత్తగా అడుగుతున్నారు అంటాడు రిషీ. అప్పుడే ఫణీంద్ర నువ్వేదో డల్ గా ఉంటున్నావ్ అని అంటాడు. మీరు ఆగండి నువ్వు వెళ్లునాన్న లెమన్ టీ పంపనా అంటుంది. సరే పెద్దమ్మా అని రిషీ లోపలకి వెళ్తాడు.

ఇంకోసీన్ లో పుష్పా ఆర్టికల్ రాయటం నా వల్ల ఐతలే అని వసూకి కాల్ చేస్తుంది. వసూ సార్ ఇచ్చిన వర్క్ నువ్వే చేయాలి నేను చేస్తే సార్ ఇద్దరని తిడతారు అంటుంది. అయినా పుష్పా నా వల్లకాదు వసూ..నువ్వే రాయ్ అంటుంది. వసూ ఇప్పుడెలా ఈ విషయం జగతిమేడమ్ అని అడుగుదాం ఏం చేయాలో అనుకుంటుంది అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version