గుప్పెడంతమనసు 335: ప్లేట్ ఫిరాయించిన రిషీ..వసూని జగతి ఇంట్లోనే ఉండమని ఆర్డర్..కొడుకు ప్రవర్తన చూసి షాకైన జగతి

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో..లగేజ్ సర్ధుకుని బయటకు వచ్చిన వసూ..జగతి దగ్గర ఆగుతుంది. జగతి ఏం మాట్లాడదు. వసూ గుమ్మం దగ్గరకు వెళ్తుంటే..మహేంద్ర వస్తాడు. వసూని అలా లగేజ్ తో చూసి మహేంద్ర షాక్ అ‌వుతాడు. ఏంటిది వసుధార..ఎక్కడికి వెళుతున్నావ్ అంటే..వసూ సమాధానం చెప్పదు..జగతి దగ్గరకు వెళ్లి.. ఏంటిది అంటాడు. వెళ్లిపోతోంది మహేంద్ర అని సమాధానం చెబుతుంది జగతి. ఎక్కడికి అని మహేంద్ర అంటే..ఇంట్లోంచి వెళ్లిపోతోందని అంటుంది. తనెక్కడికి వెళుతుంది-ఎక్కడ ఉంటుంది అంటే.. తను చిన్న పిల్ల కాదు మహేంద్ర.. ఎక్కడ ఉండాలో ఏం చేయాలో అన్నీతెలుసని చెబుతుంది జగతి. మహేంద్ర నీకేంమైంది..తనని ఇలా పంపిచేయటం కరెక్టేనా అంటే..ఒక విషయం అందరకీ కరెక్ట్ అనిపించాలని లేదు మహేంద్ర.. వ్యక్తులు-పరిస్థితుల్ని బట్టి మారుతుందని రిప్లై ఇస్తుంది. వసు ఎక్కడికి వెళ్లిపోతున్నావ్ అని అడిగితే నేను ఎవరికీ భారం కాకూడదని వెళుతున్నాను సార్ అంటుంది వసూ. భారమా..భారం ఏంటి వసుధార, చెట్టుకి కాయ భారం అవుతుందా అంటే.. కొన్నాళ్లకి కాయ కూడా చెట్టునుంచి విడిపోక తప్పదు అంటుంది. జగతి మాట్లాడవేంటి అని మహేంద్ర రెట్టించినా జగతి సమాధానం చెప్పదు.

ఎక్కడికి వెళతావ్ అంటే.. ఎక్కడో చోట నాకు ప్లేస్ దొరుకుతుంది..అంటుంది వసూ. మహేంద్ర నీ చదువు, నీ లక్ష్యాలు వీటి మాటేంటి అంటే.. నా జీవితం లక్ష్యాలను మరిచిపోను, వాటిని సాధించుకుని తీరుతా అన్న వసుతో…. నీకు సౌకర్యాలు ఉండాలి కదా అంటాడు మహేంద్ర. కడుపు నిండితే భోజనం, కన్ను మూస్తే నిద్ర… ఎదురీదితే జీవితం అవుతుందని చెబుతుంది. మహేంద్ర వీళ్ల ప్రవర్తనకు ఆగం ఆగం ఐతాడు..ఇద్దరిని ఏమైంది ఏమైంది అని అడుగుతూనే ఉంటాడు. జగతీతో.. మీరిద్దరూ గొడవ పడే అవకాశమే లేదు. నీ ప్రవర్తనలో ఏదో మార్పొచ్చింది, నువ్వు నువ్వులా లేవు, నీలో నువ్వు కాని ఓ కొత్త జగతి కనిపిస్తోంది, తనని ఎందుకు వెళ్లమంటున్నావ్ అని అడిగితే.. వెళతా అంది అంటుంది జగతి. నువ్వు ఆపలేదా అంటే….ఎవరి జీవితం వాళ్లిష్టం అంటుంది. ఇది నువ్వు కాదు..అలా అనుకోవు అని మహేంద్ర.. ఇప్పుడు అనుకోవడం మొదలు పెట్టా అని జగతి అంటుంది. ఎవరైనా బెదిరించారా అని అడిగితే..బుల్లెట్ నా భుజంలో దింపి నన్ను బెదిరిస్తేనే నేను భయపడలేదు..ఎవరో బెదిరిస్తే భయపడతానా అని స్థిరంగా సమాధానం చెబుతుంది. వసు కనీసం ఏమైందో నువ్వైనా చెప్పు అంటూనే.. జగతి మాట్లాడు మహేంద్ర గట్టిగా అరుస్తాడు. స్పందించిన జగతి..మహేంద్ర నీకో విషయం అర్థం కావడం లేదు, వసుధార జీవితం తనిష్టం, ఎక్కడికైనా వెళుతుంది, ఎక్కడైనా ఉంటుంది, వసుధార స్వతంత్రురాలు, తను ఎక్కడైనా ఉండేహక్కు ఉంటుంది, తనతో మనకేం సంబంధం మహేంద్ర అంటుంది.

రిషి ఎంట్రీ

కరెక్టుగా అదే టైంకు రిషీ వచ్చి క్లాప్స్ కొడతాడు. చేసిందంతా ఈ ఇగో మాష్టరే..వచ్చి మళ్లీ క్లాప్స్ ఒకటి. ఏంటి మేడం మీకెలాంటి సంబంధం లేదా.. అంత ఈజీగా సంబంధం లేదని ఎలా అంటారని మేడమ్.. ఏ సంబంధం లేకపోతే ఎక్కడో చదివే వసుధారని డీబీఎస్టీ కాలేజీకి ఎందుకు తీసుకొచ్చారు, ఏం సంబంధం లేకపోతే తనకోసం చాలాసార్లు నాతో ఎందుకు గొడవపడ్డారు, గురు-శిష్యుల సంబంధం కన్నా గొప్పది ఏముంది మేడం, మీకు తనపై బాధ్యత ఒకటుండాలి కదా, ఓ కాలేజ్ టాపర్ ని చదువు మధ్యలో ఇలా గాలికి వదిలేస్తే తను ఏమైపోతుందో ఆలోచించారా…అయినా మధ్యలో వదిలేయడం మీకు అలవాటే కదా అంటాడు. రిషీ ప్లేట్ మార్చేసరికి..జగతి విస్తుపోతుంది. ఒకవేళ వసుధార వెళ్తాను అన్నా కూడా మీరు ఆపాలి కదా, ఎటుపోతే నాకేంటి అనుకుంటున్నారా, జగతి మనసులో రిషీ ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటుంది. ఏంటి డాడ్ మీరు తను వెళ్లిపోతాను అంటే..చూస్తూ ఏం చేస్తున్నారు. తను వెళ్లిపోతానంటే చేతిలో బ్యాగ్ లాక్కుని విసరాలి కదా అనేసి..వసు నువ్వు ఎక్కడికీ వెళ్లడం లేదు ఇక్కడే ఉంటున్నావ్ అంటాడు. ఈ మాట విని జగతి మనసులో ఆనందపడుతుంది. ఎవరు ఏమన్నా నువ్వు ఇక్కడే ఉండాలని గట్టిగా చెబుతాడు. ఇది మీ మేడంగారి తరపున నా మాట అని చెబుతాడు. లోపలకు వెళ్లు అని చెప్పేసి బయటకు వెళ్లిపోతాడు రిషి. జగతి గుండెల్లో భారం అంతా దిగినట్లైంది.. వసూ చేతిలో బ్యాగ్ తీసుకుని లోపల పెడుతుంది జగతి. మహేంద్ర-వసుధారకి ఏమీ అర్థం కాక అలాగే ఆగిపోతారు.

ఇగో మాష్టర్ మనో విశ్లేషణ:

రోడ్డు పక్కన కారు ఆపిన రిషి..తన మాటలు గుర్తుచేసుకుంటాడు. నేనే వసుధారని హాస్టల్ కి పంపించమన్నాను-మళ్లీ నేనే వద్దన్నాను జగతి మేడం మనసులో నా గురించి ఏమనుకుంటున్నారో అనుకుంటాడు. జగతి మేడమ్ దగ్గర వసు ఉంటే ఆమె ఆలోచనలకు వసుధార కూడా.. ప్రభావం ఉంటుందన్న భయం ఉంది..నిజానికి వసుధారను అక్కడినుంచి పంపేయాలి.. కానీ.. వసు ఏదైనా తీసుకోకూడని నిర్ణయం తీసుకుని ఉంటే నేనే బాధపడాల్సి వచ్చేది.జరిగిన విషయం వసుధారకు,డాడ్ కు తెలిస్తే..నన్ను రాక్షసుడనుకుంటారా.. ఈ విషయం గురించి జగతి మేడం వసు-మహేంద్రకి చెప్పొచ్చు -చెప్పకపోవచ్చు..వసు విషయంలో నేను తీసుకున్న రెండు నిర్ణయాలు కరెక్టే. ఇప్పుడు నిజం చెప్పలేను-అబద్ధం చెప్పలేను, వసుధార విషయంలో ఇంకేమైనా ఆలోచించాలి.. కానీ జగతి మేడమ్ -వసు ఇద్దరూ శరీరం-ఆత్మలా కలసిపోయారు.. వాళ్లని కలసి చూడలేను, విడదీసి వసుని బాధించలేను..ఏదో చేయాలి అనుకుంటాడు. చేస్తాను. చేసి తీరతాను అనుకుని కార్ స్టాట్ చేస్తాడు.

జగతి-మహేంద్ర బయట నిల్చుని ఉండగా వసుధార కాఫీ ఇచ్చి వెళ్తుంది. మహేంద్ర.. ఇది నీ ఆలోచన కాదు..నీ వెనుక ఎవరున్నారు అని అడిగి.. రిషి ఏమైనా చెప్పాడా, రిషీ ఎందుకొచ్చాడు, జగతి నువ్వు ఇలా ఆలోచించవు, వసుధారని వెళ్లమని చెప్పవు, వెళ్తా అన్నా వెళ్లనివ్వవు.. ఇలా ఎందుకు చేశావ్, దీని వెనుక రిషి ఉన్నాడా అని మళ్లీ అడుగుతాడు. ఇప్పుడు మొత్తంగా చూస్తే..వెదవ అయింది జగతీఏగా..నిజం మహేంద్రకు చెప్తేనన్నా సీన్ బాగుంటుంది. రేపటి ఎపిసోడ్ లో చూద్దాం..జగతి మేడమ్ నోరు విప్పుతుందో లేదో.

Read more RELATED
Recommended to you

Exit mobile version