కార్తీకదీపం ఎపిసోడ్ 1244: అరెరే.. సినిమాటిక్ లెవల్లో కష్టాలు పడుతున్న డాక్టర్ బాబు..ప్రతి సీనూ… కంటతడిపెట్టేలా ఉందే..!

-

కార్తీకదీపం ఎపిసోడ్ విన్నీ అనే కొత్త క్యారెక్టర్ ని వారణాసి ఆటోలో తీసుకొస్తాడు. మోనిత దగ్గరకు అని తెలిసి షాక్ అవుతాడు. విన్నీ కేరళానుంచి వచ్చిందని చెప్తుంది మోనిత. మీ బెదిరింపులకు భయపడి వెళ్లేరకం కాదు అంటుంది. విన్నీ..నేను మీ దగ్గరకు వస్తున్నానని తెలియక మిమ్మల్ని చాలా తిట్టాడు అని చెబితే..ఆ తిట్లే నాకు దీవెనలు అని చెబుతుంది మోనిత. అవును వారణాసి..నా మీద నీకెందుకు అంతకోపం.. నేను కూడా మీ దీపక్కలాంటిదాన్నే నన్ను కూడా అక్క అని పిలువు అన్న మోనితతో..మీరు అనుకుంటే సరిపోదు..అది జరగనిపని మేడమ్ అనేసి వెళ్లిపోతాడు.

దీప

దుకాణాలన్నీ తిరిగి తిరిగి సరుకులు అమ్ముడవకపోవడంతో ఇలా అయితే రుద్రాణి అప్పు ఎలా తీరుస్తా అనుకుంటుంది దీప. ఇంతలో అడ్డొచ్చిన రుద్రాణి….అరెరే.. సరుకులు అలాగే ఉన్నట్టున్నాయి అమ్ముడైనట్టు లేవు, ఏం దీప.. ఇప్పటికైనా రుద్రాణి అంటే ఏంటో అర్థమైందా అంటుంది. నువ్వు ఓడిపోతావనే భయంతో ఉన్నావ్..నేను గెలుస్తాను అని ముందుకు వెళ్తున్నాను అంటుంది. మన పిండివంటలు మీద ప్రజలు అభిప్రాయం ఏంట్రా అని వాళ్ల మనుషులు అడుగుతుంది. విన్నావు కదా..నువ్వు ఏం చేసినా నేను ఎదురొస్తా అంటుంది రుద్రాణి. మీరు ఎదురొచ్చినా, బెదిరించానా బెదిరిపోయేదాన్ని కాదని ..నేనంటే ఏంటో తెలిసేలా చేశాను కదా అన్న దీపతో..అన్నీ గుర్తున్నాయ్…నీ సార్ నా దగ్గరకు వచ్చి సంతకం పెట్టిన విషయం నువ్వు గుర్తుపెట్టుకో అంటుంది రుద్రాణి. లక్షల బాకీ ఇలా తిరుగుతూ సంపాదిస్తే ఎలా తీరుస్తారు..మిమ్మల్ని సంపాదించనివ్వాలి కదా అంటుంది. గాలికి చిన్న దీపాలు మాత్రమే.. ఆరిపోతాయి…మంట మాత్రం ఇంకొంచెం పెరుగుతుందని చెప్పి వెళ్లబోతుంటే..మళ్లీ అడ్డుకున్న రుద్రాణి..ఏదీ ఏమైనా..మీరు అప్పు తీర్చలేరన్నది నాకు అర్థమైంది..అందుకే నీకొక సంక్రాంత్రి ఆఫర్ ఇస్తాను అని..నీ కూతుళ్లలో ఒకర్ని నాకిచ్చెయ్ అంటుంది. రుద్రాణి అంటూ చేయి పైకెత్తిన దీప ఆగిపోతుంది..నీకు మూడే మార్గాలు.. ఒకటి పాపని ఇవ్వడం, రెండు రంగరాజుని ఇవ్వడం, మూడు అప్పు తీర్చడం అంటుంది. దీప అప్పు తీరుస్తాను అంటుంది. ఏం చేసి తీరుస్తావ్ అని అడిగితే అన్నీ నీకు అనవసరం అనేసి వెళ్లిపోతుంది దీప. ఎలా తీరుస్తావు..పైనుంచి దేవుడు వచ్చి తీరుస్తారా అని రుద్రాణి రెట్టించడంతో..దేవుడు వస్తాడో, దేవతే వస్తుందో ఎవరికి తెలుసని వెళ్లిపోతుంది. రుద్రాణికి ఈ దీప ధైర్యం అర్థంకాదు. ఏంట్రా తినడానికి తిండిలేదు కానీ ఎంత గట్టిగా మాట్లాడుతుందో చూశారా అంటుంది.
స్కూల్ నుంచి హడావుడిగా ఇంటికివెళ్లిన కార్తీక్… పిల్లలు…. ఆకలి అన్నమాట గుర్తుచేసుకుని వంట చేద్దాం అనుకుని చూస్తే బియ్యం కనిపించవు. దీప ఇంట్లో ఎక్కడైనా డబ్బులు పెట్టిందేమో అని వెతుకుతాడు. ఇంట్లో బియ్యం,డబ్బులు లేవు..పిల్లలు ఆకలితో ఉన్నారు ఏం చేయాలి అనుకుంటాడు. పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు..ఏదోఒకటి చేసి భోజనం తీసుకెళ్లాలి అనుకుంటాడు. మరోవైపు తిరిగి తిరిగి అలసిపోయిన దీప.. పిండి వంటలు అమ్ముడవకపోవడంతో బాధపడుతుంది. రుద్రాణిని తక్కువ అంచనా వేశానా..నేను ఓడిపోకూడదు..ఏదో ఒకటి చేసి రుద్రాణి పీడ వదిలించుకోవాలి అనుకుంటుంది. ఈ సీన్ లో బాబు వెనుక భలే ముద్దుగా ఉంటాడు. . అలిసిపోయి..సోడా తాగుతుంది.అడుగుఅడుగునా అడ్డుపడుతున్న రుద్రాణికి సరైన సమాధానం చెప్పాలి..తనకు భయపడితే నేను కుటుంబాన్ని పోషించుకోలేను అనుకుంటుంది.
 ప్రకృతి వైద్యశాలకు వెళ్లేందుకు సిద్ధమైన సౌందర్యతో..నేను కూడా వస్తా అని అడుగుతాడు ఆదిత్య. సౌందర్య వద్దు అంటుంది. ఆదిత్య ఈ ప్రకృతి వైద్యం ఇవన్నీ అవసరమంటావా అని ఆదిత్య అంటే.. భారతి చెప్పినట్టు నాన్న ఈ నాలుగు గోడల మధ్యే ఉండటం మంచిది కాదని చెబుతుంది.అవునూ డాడీ రావడానికి ఒప్పుకున్నారా అంటే ఒప్పించా అంటుంది. కొడుకు్కు జాగ్రత్తలు చెప్తుంది.
కట్ చేస్తే ఓ చిన్న హోటల్ లో సీన్ ఓపెన్ అవుతుంది. అక్కడకు వెళ్లిన కార్తీక్ భోజనం కావాలని అడుగుతాడు. ఫుల్ మీల్స్ 120 అని చెప్పడంతో డబ్బుల్లేక అలాగే నిల్చుని ఉండిపోతాడు. హోటల్ యజమాని..చెప్పండి సార్ ఏం కావాలి, పెద్దనొటు ఉందా..చిల్లర ఉందా ఇవ్వండి అంటాడు. కార్తీక్.. డబ్బుల్లేవ్, ఫుల్ మీల్స్ పార్సిల్ కావాలని అడుగుతాడు. ఇదేం ధర్మ సత్రం కాదుకదా డబ్బుల్లేకుండా ఎలా ఇస్తాం అంటాడు. అక్కడ పనోడు లేక అందరూ అరుస్తుంటారు. సార్ ఈ ఊర్లోనే ఉంటాను..సాయంత్రంలోగా ఇస్తానన్న కార్తీక్ మాటలకు..వంద రూపాయలే కదా అంటావేంటి..ఏదో కోట్లు ఉన్నట్టు మాట్లాడుతున్నావేంటి..వాడుకూడా క్లాస్ ఇస్తాడు. వెళ్లమని కసురుకుంటాడు.

రేపటి ఎపిసోడ్ లో

హోటల్లో వంటచేసి పిల్లలకు భోజనం తీసుకెళతాడు కార్తీక్. మరోవైపు దీప వంటలు రుచి చూసిన అదే హోటల్ యజమాని..నువ్వు వంటలు బాగా చేస్తావని అర్థమైంది..నీకు పనిస్తా అంటాడు. అంతకన్నా కావాల్సిందే ఏముంది సంతోషంగా పనిచేస్తా అంటుంది. ఇంతలో అక్కడకు కార్తీక్ వస్తాడు. అసలు ఈ డాక్టర్ బాబుకి ఇన్ని కష్టాలు ఏంటో..ఈ సీరియల్ ఏంటో..మరి ఎమోషనల్ కంటెంట్ క్రియేట్ చెస్తున్నాడు డైరెక్టర్..జనాలు ఒకప్పుడు ఇలాంటి ఏడుపులు, కష్టాలను చూసేవాల్లు కానీ..ఇప్పుడు ఇలా ఓ కష్టాలు పెడితే విసుగుచెందుతున్నారు. ఇప్పటికే..ఫెయిల్యూర్ దిశగా అడుగులు వేసింది ఈ సీరియల్.. ఇంకా ఇలానే ఉంటే..టాప్ లో ఉన్నది కాస్తా..లీస్ట్ లోకి వెళ్లడం కాయం అంటున్నారు ప్రేక్షకులు.!
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version