వికారాబాద్‌లోని కొత్తగడి బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు హాస్టల్ నుంచి బయటకు ఎందుకు వెళ్లారని ముగ్గురు విద్యార్థినులను ప్రిన్సిపాల్ సాయిలత బూతులు తిడుతూ వారిని తీవ్రంగా కొట్టినట్లు సమాచారం. ఈ విషయం ఎవరికైనా చెబితే టీసీ ఇచ్చి పంపిస్తానని తల్లిదండ్రులకు ఫోన్‌చేసి హెచ్చరించినట్లు సైతం తెలుస్తోంది.
దీనికి సంబంధించిన వీడియో బయటకు లీక్ కావడంతో ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఇదిలాఉండగా, గతంలోనూ ప్రిన్సిపల్ సాయిలత వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని భవనంపైనుంచి దూకి కాలు విరగ్గొట్టుకున్న విషయం తెలిసిందే.
గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ దాష్టీకం..విచక్షణారహితంగా దాడి
వికారాబాద్‌లోని కొత్తగడి బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు హాస్టల్ నుంచి బయటకు ఎందుకు వెళ్లారని ముగ్గురు విద్యార్థినులను ప్రిన్సిపాల్ సాయిలత బూతులు తిడుతూ దాడిచేశారు. ఎవరికైనా చెప్పితే టీసీ ఇచ్చి పంపిస్తానని… pic.twitter.com/ZNfKG9r3sj
— ChotaNews App (@ChotaNewsApp) April 1, 2025