హైనా దాడిలో రెండు లేగ దూడలు మృతి చెందాయి. ఈ ఘటన సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం ముండ్రాయి గ్రామ శివారులో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. బొంగు మల్లేశం తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు లేగ దూడలను కట్టేసి వెళ్ళాడు. రాత్రి సమయంలో హైనా దాడి చేసి చంపేసింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
వారం రోజుల క్రితం అదే గ్రామంలో బొంగు కనకయ్యకు చెందిన లేగదూడపై హైనా చంపేసినట్లు సమాచారం.వారం రోజుల వ్యవధిలో రెండు చోట్ల హైనా దాడి చేసి దూడలను చంపివేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వాటిని వెంటనే పట్టుకోవాలని స్థానిక రైతులు అటవీశాఖను కోరారు.