అక్రమం ఆపాల్సిందే: గుత్తా సుఖేందర్ రెడ్డి

-

నల్గొండ: రాయలసీమ ఎత్తిపోతలను తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి వ్యతిరేకిస్తోందని మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాయలసీమ ఎత్తిపోతలతో తెలంగాణకు అన్యాయమేనన్నారు. జగన్ కృష్ణా జలాలను దోచుకోవాలనే దురుద్దేశంతో ఉన్నారని ఆయన ఆరోపించారు. శ్రీశైలం బెడ్ లెవల్ నుంచే నీళ్లు తీసుకెళ్లాలనే ఆలోచన మంచిది కాదని గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో నదీ జలాల సమస్య, ఆస్తుల పంపకం, విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్టీటీ ముట్టికాయలు వేసిందని గుత్తా గుర్తు చేశారు. గతంలో రాజశేఖర్ రెడ్డి కూడా తెలంగాణకు అన్యాయం చేశారని ఆరోపించారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంశంపైనా గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. పీసీసీ చీఫ్‌గా ఎవరున్నా కాంగ్రెస్ అధికారంలోకి రావడం కలేనన్నారు. ఈ రెండేళ్లలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సంసారాన్ని సరిదిద్దుకుంటే సరిపోతుందని ఎద్దేవా చేశారు.

 

ఇక ఏపీ, తెలంగాణ మధ్య జలజగడం మరింత ముదురుతోంది. రాయలసీమ ఎత్తిపోతల పనులు ఏపీ చేపట్టింది. దీంతో టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అటు ఏపీ నేతలు కూడా అంతేవిధంగా స్పందిస్తున్నారు. టీఆర్ఎస్ నేతలకు కౌటర్ ఇస్తున్నారు. ఒక్క చుక్క నీటిని కూడా అక్రమంగా వాడుకోవడంలేదని అంటున్నారు. తెలంగాణ జరిగేలా పనులు చేపట్టడంలేదని చెబుతున్నారు. తమకు రావాల్సిన వాటానే వినియోగించుకుంటున్నామని అంటున్నారు. మరి ఈ జల వివాదం ముగుస్తుందేమో చూాడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version