హైదరాబాద్: తెలంగాణలో రాజీయం రంజుగా మారుతోంది. రేవంత్‌రెడ్డిని టీపీసీసీ చీఫ్‌గా ప్రకటించడంతో మిగిలిన పార్టీలు కూడా అలెర్ట్ అయ్యాయి. టీపీసీసీ ఇస్తే పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టంతో మిగిలిన పార్టీలు నేతలు కూడా జనం పట్టాలని భావిస్తున్నారు.
అయితే గతంలోనే బండి సంజయ్ పాదయాత్ర చేయాలని భావించారు. అయితే కోవిడ్, జీహెచ్ఎంసీ, దుబ్బాక ఎన్నికలు వరుసగా రావడంతో ఆయన వాయిదా వేసుకున్నారు. తెలంగాణలో ప్రజా సమస్యలు తెలుసుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఇందులో భాగంగానే పాదయాత్ర ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనే అంశంపై స్పష్టలేకపోయినప్పటికీ ముగింపు మాత్రం హుజురాబాద్‌లో ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.