వైసీపీ చేతకానీ పార్టీ.. టీడీపీ భవిష్యత్తు లేని పార్టీ : బీజేపీ ఎంపీ జీవీఎల్

-

వైసీపీ చేతకానీ పార్టీ.. టీడీపీ భవిష్యత్తు లేని పార్టీ అంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అంటే భవిష్యత్తులో చేయించే పార్టీ అని జీవీఎల్‌ అన్నారు. ఇవాళ ఏపీలో జరిగిన బీజేపీ సభలో జీవీఎల్‌ మాట్లాడుతూ.. ఏపీలో ప్రతి ఒక్కరూ బీజేపీ పాలన కావాలని కోరుకుంటున్నారని… ప్రధాని మోడీని భగవత్ స్వరూపంగా చూస్తున్నారన్నారు.

ప్రపంచ దేశాల్లో దేశాన్ని అగ్రగామిగా నిలిపారని… ఏపీలో సీఎంలుగా పని చేసిన చంద్రబాబు, జగన్ పని తీరు మోడీ తరహాలో ఉందా..? అని ప్రశ్నించారు. పాకిస్తాన్, చైనా లాంటి దేశాలని సైలెంట్ చేసేశారు మోడీ అని కొనియాడారు. వచ్చే వేయ్యేళ్లల్లో మోడీ పేరు కాశీలో చిరస్మరణీయంగా ఉండిపోతుందన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరుగుతుందని ఎవరైనా ఊహించారా..? దాన్ని మోడీ నిజం చేసి చూపించారని తెలిపారు. ఏపీకి ఇప్పటి వరకు రూ. 70 వేల కోట్లకు పైగా నిధులిచ్చిందని.. ఇన్ని నిధులిస్తోన్నా.. అప్పులు చేయాల్సిన పరిస్థితు ఎందుకొచ్చింది..? అని ప్రశ్నించారు. ప్రజాగ్రహ సభ అనగానే వైసీపీ-టీడీపీలకు గుబులు మొదలైందని చురకలు అంటించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version